ETV Bharat / bharat

పుట్టిన రోజున కరోనాను జయించిన మాజీ సీఎం - కరోనాను జయించిన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కరోనాను జయించారు. గురువారం.. ఆసుపత్రి నుంచి డిశ్చార్జి​ కానున్నట్లు ఆయన కార్యాలయం వెల్లడించింది. ఇవాళ (ఆగస్టు 12) పుట్టినరోజున మహమ్మారిని జయించారు కాంగ్రెస్​ సీనియర్​ నేత.

COVID-19: Siddaramaiah tests negative, will be discharged on Aug 13
పుట్టిన రోజున కరోనాను జయించిన మాజీ సీఎం
author img

By

Published : Aug 12, 2020, 10:55 AM IST

Updated : Aug 12, 2020, 11:08 AM IST

కరోనా బారినపడ్డ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వైరస్‌ బారి నుంచి బయటపడ్డారు. సిద్ధరామయ్య ఆసుపత్రి నుంచి గురువారం ఇంటికి చేరుకోనున్నారని ఆయన కార్యాలయం తెలిపింది. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో నెగెటివ్‌ వచ్చినట్లు వెల్లడించింది.

కరోనా అని తేలడం వల్ల 71 ఏళ్ల సిద్ధరామయ్య ఈనెల 4న బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నారని ఆయన కార్యాలయం తెలిపింది. ఇవాళ.. సిద్ధరామయ్య పుట్టినరోజు కూడా కావడం విశేషం.

కర్ణాటకలో ఇప్పటికే ముఖ్యమంత్రి యడియూరప్పకు కూడా కరోనా సోకగా ఆయన సైతం కోలుకున్నారు.

ఇదీ చూడండి:కరోనా పంజా: 23 లక్షలు దాటిన కేసులు

Last Updated : Aug 12, 2020, 11:08 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.