ETV Bharat / bharat

'పీఎం కేర్స్​ నిధుల బదిలీ అవసరం లేదు'

పీఎం కేర్స్​ ద్వారా సేకరించిన నిధులను ఎన్​డీఆర్​ఎఫ్​కు బదిలీ చేయాలని దాఖలైన పిటిషన్​ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం చట్టబద్ధమైన అవరోధాలు లేవని పేర్కొంది. ఎన్​డీఆర్‌ఎఫ్‌కు వ్యక్తులు, కార్పొరేట్‌ సంస్థలు ఎల్లవేళలా సహకారం అందించవచ్చని స్పష్టం చేసింది.

COVID-19: SC refuses to direct transfer of contributions made to PM CARES to NDRF
'పీఎం కేర్స్​ నిధుల బదిలీ అవసరం లేదు'
author img

By

Published : Aug 18, 2020, 12:23 PM IST

కరోనాపై పోరు కోసం పీఎం కేర్స్​ ద్వారా సేకరించిన నిధులను జాతీయ విపత్తు నిర్వహణ నిధి(ఎన్డీఆర్​ఎఫ్​)కి బదిలీ చేయాలని దాఖలైన పిల్​ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఆ అవసరం లేదని పేర్కొంది. ఎన్​డీఆర్‌ఎఫ్‌కు వ్యక్తులు, కార్పొరేట్‌ సంస్థలు ఎప్పుడైనా సహకారం అందించవచ్చని జస్టిస్​ అశోక్ భూషణ్​ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. ఎన్​డీఆర్‌ఎఫ్‌కు సహకరించేందుకు చట్టబద్ధమైన అవరోధాలేమీ లేవని పేర్కొంది. కరోనాపై పోరాటానికి జాతీయ ప్రణాళిక-2019 సరిపోతుందని సర్వోన్నత న్యాయస్థానం చెప్పింది.

పీఎం కేర్స్​ నిధులు ఎన్​డీఆర్​ఎఫ్​కు బదిలీ చేసేలా ఆదేశాలు జారీ చేయాలని ఓ ఎన్జీఓ దాఖలు చేసిన పిటిషన్​ను విచారించి ఈ మేరకు తీర్పు వెలువరించింది సుప్రీంకోర్టు.

కరోనా నేపథ్యంలో అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు మార్చి 28న పీఎం కేర్స్​ నిధిని ఏర్పాటు చేసింది కేంద్రం. దీనికి ప్రధాని నరేంద్ర మోదీ ఛైర్మన్​గా ఉండగా.. రక్షణ, హోం, ఆర్థిక శాఖ మంత్రులు ట్రస్టీలుగా ఉన్నారు.

ఇదీ చూడండి: 'మన్ ​కీ బాత్'​లో ఏం మాట్లాడాలో చెప్పండి: మోదీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.