ETV Bharat / bharat

కరోనా 'రికవరీ'లో ఆ 21 రాష్ట్రాలు భేష్

21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కరోనా నుంచి కోలుకునే వారి సంఖ్య జాతీయ సగటుకన్నా ఎక్కువ ఉందని తెలిపింది కేంద్ర ఆరోగ్య శాఖ. అత్యధికంగా ఛండీగఢ్​లో 85.9 శాతం రికవరీ రేటు నమోదైందని వెల్లడించింది.

COVID-19 recovery rate in 21 states, UTs higher than national average of 60.77 pc: Health min
జాతీయ సగటు కన్నా ఆ 21 రాష్ట్రాల్లో రికవరీ రేటు ఎక్కువ
author img

By

Published : Jul 5, 2020, 4:35 PM IST

దిల్లీ, గుజరాత్​, ఉత్తర్​ప్రదేశ్​ సహా 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కరోనా బాధితుల రికవరీ రేటు.. జాతీయ సగటుకన్నా ఎక్కువగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా వైరస్​ నియంత్రణ, నిర్వహణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన సమష్టి కృషితోనే ఇది సాధ్యపడిందని పేర్కొంది.

ఆదివారం నాటికి దేశంలో 6.73 లక్షల కేసులు వెలుగుచూశాయి. బాధితుల్లో ఇప్పటివరకు 4,09,082 మంది వైరస్​ను జయించినట్టు తెలిపింది ఆరోగ్య శాఖ. దేశవ్యాప్తంగా ఆదివారం ఉదయం 8 గంటల వరకు.. 2,44,814 యాక్టివ్​ కేసులున్నట్టు స్పష్టం చేసింది.

ఇప్పటివరకు మొత్తం 14,856 మంది బాధితులు కోలుకున్నారని, ఫలితంగా జాతీయ రికవరీ రేటు 60.77 శాతానికి చేరిందని తెలిపింది ఆరోగ్య శాఖ.

రాష్ట్రం/యూటీరికవరీ రేటు(శాతం)
ఛండీగఢ్​85.9
లద్దాఖ్​82.2
ఉత్తరాఖండ్​80.6
రాజస్థాన్​80.1
మిజోరం79.3
త్రిపుర77.7
మధ్యప్రదేశ్​76.9
ఝార్ఖండ్​74.3
బిహార్​74.2
హరియాణా74.1
గుజరాత్​71.9
పంజాబ్​70.5
దిల్లీ70.2
మేఘాలయ69.4
ఒడిశా69.0
ఉత్తరప్రదేశ్​68.4
హిమాచల్​ప్రదేశ్​67.3
బంగాల్​66.7
అసోం62.4
జమ్ముకశ్మీర్​62.4

ఇదీ చూడండి:- ప్రపంచంలోనే అతిపెద్ద కొవిడ్ ఆసుపత్రి దిల్లీలో..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.