దేశంలో కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యనేతలతో ఫోన్లో సంభాషించారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. మాజీ రాష్ట్రపతులు ప్రణబ్ ముఖర్జీ, ప్రతిభా పాటిల్, మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, దేవెగౌడ, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీలతో దేశంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించారు.
సమాజ్ వాదీ పార్టీ ముఖ్యనేతలు ములాయం సింగ్ యాదవ్, అఖిలేశ్ యాదవ్, బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, డీఎంకే నేత స్టాలిన్, శిరోమణి అకాలీదళ్ నేత ప్రకాశ్ సింగ్ బాదల్‌లతో వైరస్‌పై పోరాడే అంశమై సంభాషించారు మోదీ.
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా..
బుధవారం వివిధ పార్టీల సభాపక్షనేతలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించనున్నారు ప్రధాని.
ఇదీ చూడండి: భార్య ప్రసవం కోసం 600 కి.మీ 'లాక్డౌన్ యాత్ర'