సెప్టెంబరు మధ్య వరకు భారత్లో కరోనా వైరస్ వ్యాప్తి అంతరిస్తుందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖలోని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గణిత నమూనా ఆధారిత విశ్లేషణ ఆధారంగా దీనిని అంచనా వేశారు. వైరస్ సోకిన వారి సంఖ్య, కోలుకున్న వారు, మరణించినవారి సంఖ్యలను విశ్లేషించి ఈ విషయాన్ని వెల్లడించారు.
డీజీహెచ్ఎస్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డా అనిల్ కుమార్, డిప్యూటీ అసిస్టెంట్ డైరెక్టర్ రూపాలి రాయ్ విశ్లేషించిన వివరాలు ఎపిడెమియాలజీ ఇంటర్నేషనల్ ఆన్లైన్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. కోలుకున్న వారు, మరణించిన వారి సంఖ్యతో మొత్తం కేసుల సంఖ్య సమం అయినప్పుడు వైరస్ వ్యాప్తి తగ్గినట్లేనని వీరు భావిస్తున్నారు.
బెయిల్ గణిత నమూనాను ప్రామాణికంగా తీసుకుని దీనిని విశ్లేషించారు. మార్చి 1 నుంచి మే 19 వరకు నమోదైన కేసుల వివరాలను పరిశీలించారు. వరల్డోమీటర్స్ వెబ్సైట్లోని వివరాలను కూడా పరిణగణలోకి తీసుకున్నారు.