భారత్లో కరోనా విశ్వరూపం చూపిస్తోంది. రోజూ సగటున 60 వేల మంది ఈ మహమ్మారికి బాధితులుగా మారుతున్నారు. తాజాగా 66,999 కేసులు, 942 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 23 లక్షల 96 వేలు దాటింది.
రికార్డు స్థాయిలో కొవిడ్ పరీక్షలు
దేశంలో కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా వైరస్ నిర్ధరణ పరీక్షలను భారీగా నిర్వహిస్తున్నారు. బుధవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 8,30,391 నమూనాలను టెస్ట్ చేశారు. దీంతో మొత్తం పరీక్షల సంఖ్య 2 కోట్ల 68 లక్షల 45 వేలు దాటింది.
ఇదీ చూడండి: కరోనా టీకా సరఫరా వ్యూహంపై నిపుణుల బృందం చర్చ