దేశంలో మహమ్మారి కరోనా విలయం కొనసాగుతోంది. మహారాష్ట్రలో తాజాగా 18,105 కేసులు నిర్ధరణయ్యాయి. రాష్ట్రంలో ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. మరో 391 మంది కొవిడ్‌కు బలయ్యారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,43,844కి చేరింది.
కర్ణాటకలో...
కర్ణాటకలో భారీ సంఖ్యలో వైరస్ కేసులు వెలుగుచూస్తున్నాయి. తాజాగా 8,865 కేసులు బయటపడ్డాయి. మరో 104 మంది మృతి చెందారు. ఫలితంగా రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 3 లక్షల 70 వేలు దాటింది. ఇప్పటివరకు 2 లక్షల 68 వేల మంది కోలుకున్నారు.
కేసుల కంటే రికవరీ అధికంగా
తమిళనాడులో విపరీతంగా కరోనా కేసులు పెరగుతున్నప్పటికీ... రికవరీలు అదే స్థాయిలో ఉన్నాయి. కొత్తగా 5,892 మంది కొవిడ్ బారిన పడగా.. 92 మృత్యువాత పడ్డారు. అయితే ఇవాళ ఒక్కరోజే 6,110 మంది డిశ్చార్జ్ అయ్యారు.
వైరస్ విలయతాండవం..
ఉత్తర్‌ప్రదేశ్‌లో ఒక్కరోజే 5,776 మందికి వైరస్ సోకింది. మరో 76 మంది చనిపోయారు. ఫలితంగా రాష్ట్రంలో మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య 2 లక్షల 47 వేలు దాటింది.
రాష్ట్రం | కొత్త కేసులు |
దిల్లీ | 2,737 |
పంజాబ్ | 1,527 |
గుజరాత్ | 1,325 |
జమ్ముకశ్మీర్ | 1,079 |
ఉత్తరాఖండ్ | 946 |
గోవా | 713 |
ఇదీ చూడండి: 70% కరోనా మరణాలు ఆ ఐదు రాష్ట్రాల్లోనే