దేశంలో కరోనా బీభత్సం సృష్టిస్తుంది. వివిధ రాష్ట్రాల్లో వైరస్ ఉగ్రరూపం దాల్చుతోంది. విపరీతంగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో ఇవాళ ఒక్కరోజే 16,408కేసులు బయటపడ్డాయి. మరో 296 మంది వైరస్‌కు బలయ్యారు. ఇప్పటివరకు 5 లక్షల 62 వేల మందికిపైగా రికవరీ అయ్యారు.
ఉగ్రరూపం..
కర్ణాటకలో కొత్తగా 8,852 మందికి వైరస్ సోకింది. 106 మంది మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 3 లక్షల 34 వేలకు చేరువలో ఉంది. 2 లక్షల 42 వేల మందికి పైగా కొవిడ్ నుంచి కోలుకున్నారు.
6 వేలకు పైగా..
ఉత్తర్‌ప్రదేశ్‌లో తాజాగా 6,233 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. 67 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2 లక్షల 25 వేలు దాటింది.
కరోనా విలయం..
తమిళనాడులో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. ఇవాళ ఒక్కరోజే 6,495 కేసులు నమోదవగా... మరో 94 మంది మహమ్మారితో చనిపోయారు. 3,62,133 మంది వైరస్ నుంచి బయటపడ్డారు.
ఇతర రాష్ట్రాల్లో ఇలా..
- కేరళలో కొత్తగా 2,154 మంది వైరస్ బారిన పడ్డారు. ఏడుగురు మరణించారు.
- బిహార్‌లో ఒక్కరోజే 2,078 మందికి కొవిడ్ నిర్ధరణ అయింది. అయితే కొత్త కేసుల కంటే రికవరీ అధికంగా ఉండటం విశేషం. ఇవాళ ఒక్కరోజు 2,231మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు.
- దిల్లీలో తాజాగా 2,024 కేసులు వెలుగుచూశాయి. మరో 22 మంది మృతి చెందారు.
- పంజాబ్‌లో కొత్తగా 1,689 కేసులు నమోదుకాగా.. 56 మంది కొవిడ్‌కు బలయ్యారు.
- రాజస్థాన్ రవాణా శాఖ మంత్రి ప్రతాప్ సింగ్ కచారియా కరోనా బారిన పడ్డారు. స్వయంగా ఆయనే ట్విట్టర్ వేదికగా తెలిపారు.
ఇదీ చూడండి: ఒడిశాలో వరద బీభత్సం- 17 మంది మృతి