ETV Bharat / bharat

లాక్​డౌన్​ మరో 2 వారాలు పొడిగింపు?

దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ను మరో 2 వారాలు పొడిగించనున్నట్లు తెలుస్తోంది. అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని నరేంద్ర మోదీ.. వీడియోకాన్ఫరెన్స్​ నిర్వహించిన అనంతరం కేంద్రం ఇదే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఒడిశా, పంజాబ్​లు లాక్​డౌన్​ను​ ఏప్రిల్​ 30 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నాయి.

COVID-19 lockdown: PM holds meeting with CMs; Delhi, Punjab suggest extension of nationwide lockdown till April 30
లాక్​డౌన్​ మరో 2 వారాలు పొడిగింపు?
author img

By

Published : Apr 11, 2020, 4:03 PM IST

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్​డౌన్​ పొడిగింపుపై, వైరస్ వ్యాప్తితో తలెత్తే పరిస్థితులపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ... అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియోకాన్ఫరెన్స్​ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏప్రిల్ 30 వరకు దేశవ్యాప్తంగా లాక్​డౌన్ పొడిగించాలని పలు రాష్ట్రాల​ ముఖ్యమంత్రులు ప్రధాని మోదీకి సూచించారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ పొడిగింపే అన్ని సమస్యలకు పరిష్కారమని విన్నవించారు.

రాష్ట్రాల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న కేంద్రం లాక్‌డౌన్‌ను పొడిగింపునకు మొగ్గు చూపినట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మరో 2 వారాలు పొడిగించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఒడిశా, పంజాబ్‌ రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను ఈ నెల 30 వరకూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నాయి.

ఏప్రిల్​ 30 వరకు లాక్​డౌన్​?

వీడియో కాన్ఫరెన్సింగ్​ ద్వారా ప్రధానితో మాట్లాడిన పంజాబ్​ ముఖ్యమంత్రి అమరీందర్​ సింగ్​ ఏప్రిల్​ 14 తరువాత కనీసం 15 రోజులపాటైనా లాక్​డౌన్​ పొడిగించాలని సూచించారు. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్​ కూడా ఏప్రిల్ 30 వరకు లాక్​డౌన్ పొడిగించాలని సూచించినట్లు సమాచారం. పలు రాష్ట్రాలు కూడా మరో రెండు వారాలపాటు లాక్​డౌన్ కొనసాగింపునకే మొగ్గుచూపాయి.

కరోనా ఉద్ధృతి నేపథ్యంలో పంజాబ్​, ఒడిశా ప్రభుత్వాలు ఇప్పటికే తమతమ రాష్ట్రాల్లో లాక్​డౌన్​ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం...​ ఏప్రిల్​ 14తో ముగియనున్న లాక్​డౌన్​ను​ కొన్ని సడలింపులతో పొడిగించే అవకాశముంది.

మినహాయింపులు

కేంద్ర హోంమంత్రిత్వశాఖ వివిధ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలను కోరింది. ప్రస్తుతం అత్యవసర సేవలకు మాత్రమే మినహాయింపు ఇస్తున్నారు. మరి లాక్​డౌన్​ పొడిగిస్తే మరిన్ని వర్గాల ప్రజలకు, సేవలకు మినహాయింపు ఇవ్వాల్సిన అవసరముందో? లేదో? సూచించాలని కోరింది.

ముఖ్యంగా వ్యవసాయ కార్యకలాపాలు కొనసాగించాలని, నిర్మాణ పరిశ్రమకు గ్రేడెడ్​ పద్ధతిలో మినహాయింపులు ఇవ్వాలని ప్రధాని భావిస్తున్నట్లు సమాచారం.

మహామహులతో చర్చ

ప్రధాని మోదీ ఏప్రిల్​ 2న మొదటి సారి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, లాక్​డౌన్​ పరిస్థితులపై చర్చించారు. తాజాగా మరోసారి వారితో సమావేశమయ్యారు.

ప్రధాని మోదీ నిర్వహించిన ఈ వీడియో కాన్ఫరెన్స్​లో ... కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ అధికారులు, ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ (బంగాల్​), ఉద్ధవ్​ ఠాక్రే (మహారాష్ట్ర), యోగి ఆదిత్యనాథ్​ (ఉత్తర్​ప్రదేశ్​), మనోహర్​లాల్​ ఖట్టర్​ (హరియాణా), కె.చంద్రశేఖరరావు (తెలంగాణ), నితీశ్​కుమార్​ (బిహార్​) పాల్గొన్నారు.

ప్రతి ప్రాణం కాపాడతాం!

ప్రధాని మోదీ బుధవారం వివిధ పార్టీల ఫ్లోర్ లీడర్లతో మాట్లాడుతూ లాక్​డౌన్​ను ఒకేసారి ఎత్తివేయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ప్రతి ప్రాణాన్ని కాపాడటం తమ ప్రభుత్వ విధి అని ఉద్ఘాటించారు. ఈ నేపథ్యంలో లాక్​డౌన్ పొడిగించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.

భారీగా పెరుగుతున్న కేసులు

దేశంలో గత 24 గంటల్లో 40 కరోనా మరణాలు, 1035 కేసులు నమోదు అయ్యాయి. ఈ స్థాయిలో మరణాలు, కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. దీనితో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7447కు చేరింది. కరోనా మృతుల సంఖ్య 239గా ఉంది. మరో 643 మంది మాత్రం ఈ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారు.

ఇదీ చూడండి: 'ముగ్గురు భార్యలు, 12 మంది పిల్లలను పోషించలేకపోతున్నా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.