ETV Bharat / bharat

'వ్యాక్సిన్​ వచ్చే వరకు పాఠశాలలు తెరవద్దు' - తల్లిదండ్రులు

కరోనా మహమ్మారికి వ్యాక్సిన్​ వచ్చినప్పుడు లేదా సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాతే పాఠాశాలలను తిరిగి ప్రారంభించాలంటూ 2 లక్షల మందికిపైగా తల్లిదండ్రులు అభ్యర్థించారు. ఈ మేరకు అభ్యర్థనపత్రంపై సంతకం చేశారు. కరోనా పరిస్థితులపై రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాలతో జులైలో చర్చించి విద్యాసంస్థలు తెరుస్తామని కేంద్రం ఇప్పటికే ప్రకటించింది.

COVID-19 lockdown: Parents concerned over plans to reopen schools, over 2 lakh petition govt
కరోనావ్యాక్సిన్​ వచ్చే వరకు పాఠశాలలను తెరవద్దు'
author img

By

Published : Jun 1, 2020, 4:34 PM IST

కరోనా వ్యాక్సిన్​ వచ్చే వరకు పాఠశాలలను పునఃప్రారంభించవద్దని ప్రభుత్వాన్ని తల్లిదండ్రులు అభ్యర్థించారు. ఈ మేరకు 2.13 లక్షల మంది అభ్యర్థనపత్రంపై సంతకం చేశారు.

"జులైలో పాఠశాలలను తెరిచేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనది కాదు. ఇలా చేస్తే అగ్నికి ఆజ్యం పోసినట్లు అవుతోంది. ప్రస్తుత విద్యా సంవత్సరాన్ని ఈ-లెర్నింగ్​ పద్ధతిలోనే కొనసాగించండి. వర్చువల్​ విధానంలో పాఠశాలలు వాటి బాధ్యతను సక్రమంగా నిర్వహించగలుగుతున్నప్పుడు ఇలానే ఎందుకు కొనసాగించకూడదు? " - తల్లిదండ్రుల అభ్యర్థన

పరిస్థితులను సమీక్షించి జులై నెలలో అన్ని విద్యా సంస్థలు తిరిగి ప్రారంభించనున్నట్లు శనివారం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ ప్రకటనపై పలువులు తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది.

"ఇంటి దగ్గర అనేక రకాల ముందు జాగ్రత్తలతో పిల్లల్ని చూసుకుంటున్నాం. కానీ పాఠశాలల్లో ఇలా ఉంటుందా?. భోజనం చేసేటప్పుడు, పాఠశాల బస్సుల్లో, ప్రతి చోట మాకు భయంగా ఉంటుంది. కేసులు పెరుగుతున్న తరుణంలో పాఠశాలలను తెరవటం తెలివైన పని కాదు."

- ఓ విద్యార్థి తల్లి

ఇదీ చూడండి:పెరిగిన గ్యాస్​ సిలిండర్ ధరలు.. ఎంతంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.