ETV Bharat / bharat

గుడ్​న్యూస్​: దేశంలో తగ్గుతున్న కరోనా సీఎఫ్​ఆర్​ - కేస్​ ఫటాలిటీ రేట్​

దేశవ్యాప్తంగా కరోనా సీఎఫ్​ఆర్​ క్రమక్రమంగా తగ్గుతోందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం 2.49శాతానికి చేరిందని వెల్లడించింది. నమోదవుతున్న కేసులను మరణాలతో పోల్చితే.. దాన్ని సీఎఫ్​ఆర్​(కేస్​ ఫటాలిటీ రేట్​) అంటారు.

COVID-19: India's case fatality rate 'progressively falling', among lowest in world
దేశంలో కరోనా కేసులతో పోల్చుకుంటే మరణాల రేటు తక్కువే
author img

By

Published : Jul 19, 2020, 6:47 PM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా సీఎఫ్​ఆర్(కేస్​ ఫటాలిటీ రేట్​) అత్యల్పంగా ఉన్న దేశాల్లో భారత్​ ఒకటని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. సీఎఫ్​ఆర్​ క్రమక్రమంగా తగ్గుతూ.. ప్రస్తుతం 2.49శాతాని చేరిందని పేర్కొంది. ఆసుపత్రుల్లో చేరుతున్న బాధితులకు మెరుగైన చికిత్స అందిస్తుండటమే ఇందుకు కారణమని పేర్కొంది.

నమోదైన కేసులు, మరణాల నిష్పత్తినే సీఎఫ్​ఆర్​(కస్​ ఫటాలిటీ రేట్​) అంటారు. 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సీఎఫ్​ఆర్​... భారత మరణాల రేటు సగటుకన్నా తక్కువగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీటిల్లోని ఐదు రాష్ట్రాల్లో సీఎఫ్​ఆర్​ 0 అని, 14 రాష్ట్రాల్లో సీఎఫ్​ఆర్​ 1శాతం కన్నా తక్కువగా ఉందని పేర్కొంది.

ఇదీ చూడండి:- భారత్​లో కొత్తగా 38,902 కేసులు, 543 మరణాలు

కరోనా కట్టడి వ్యూహాలను సమర్థంగా అమలు చేయడం, పరీక్షలు విస్తృతంగా చేపట్టడం, నిబంధనలు​ పాటిస్తూ ప్రామాణిక చికిత్స అందించడం ద్వారా దేశవ్యాప్తంగా మరణాల రేటు తగ్గుతోందని స్పష్టం చేసింది ఆరోగ్య శాఖ.

గత నెలలో 2.82శాతంగా ఉన్న మరణాల రేటు.. ఈ నెల 10వ తేదీకి 2.72శాతానికి చేరింది. తాజాగా 2.49కి దిగొచ్చింది.

ఇదీ చూడండి:- 'ఆపరేషన్​ కరోనా'పై పార్లమెంటరీ కమిటీల పరిశీలన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.