ETV Bharat / bharat

బడి మానేసిన పిల్లల కోసం ఇక ఇంటింటి సర్వే - విద్యార్థుల కోసం ఇంటింటి సర్వే

అర్ధంతరంగా చదువు మానేసిన పిల్లలను తిరిగి బడిబాట పట్టించేందుకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది కేంద్రం. రాష్ట్రాల్లో ఇంటింటి సర్వే నిర్వహించి బడి మానేసిన పిల్లల పేర్లను నమోదు చేసేందుకు కార్యాచరణ రూపొందించాలని సూచించింది.

COVID-19 impact: Door-to-door survey to enroll students, relaxing detention norms recommended by Education Ministry
'బడి మానేసిన పిల్లలను గుర్తించేందుకు ఇంటింటి సర్వే'
author img

By

Published : Jan 11, 2021, 11:40 AM IST

కొవిడ్​-19 సంక్షోభంతో మధ్యలోనే చదువు మానేసిన పిల్లలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇంటింటి సర్వే నిర్వహించి డ్రాప్​ అవుట్​లను గుర్తించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. డ్రాప్ అవుట్​లను తగ్గించే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కార్యాచరణ రూపొందించాలని సిఫార్సు చేసింది. అంతేకాక మార్కులు తక్కువ వచ్చిన విద్యార్థులను పాఠశాల నుంచి తీసివేసే విధానాన్ని రద్దు చేయాలని పేర్కొంది. చదువు మానేసిన విద్యార్థులను గుర్తించడం, పాఠశాలలో చేర్పించటం, విద్యను కొనసాగించటం అనే మూడు లక్ష్యాలతో ముందుకెళ్లాలని సూచించింది.

" అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇంటింటి సర్వే నిర్వహించి అర్ధంతరంగా చదువు మానేసిన 6-18 సంవత్సరాల వయస్సు కలిగిన పిల్లలను గుర్తించాలి. వారి పేర్లను నమోదు చేసేందుకు కార్యాచరణను సిద్ధం చేయాలి. కరోనా ప్రభావం పిల్లలపై పడకుండా చూడాలి."

--కేంద్ర విద్యాశాఖ అధికారులు

విద్యార్థులు సిలబస్​లోని పుస్తకాలు కాకుండా ఇతర పుస్తకాలు సైతం చదివేందుకు ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వాలను తెలిపింది కేంద్రం. దీని వల్ల విద్యార్థుల్లో నైపుణ్యాలు పెరుగుతాయని పేర్కొంది.

ఇదీ చదవండి : విద్యార్థులకు ఉచితంగా రోజుకు 2జీబీ డేటా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.