ETV Bharat / bharat

భౌతిక దూరం లక్ష్యంతో 'బ్లూటూత్ స్టెతస్కోప్' ఆవిష్కరణ - కరోనా వైరస్ వార్తలు

కరోనా బాధితులను పర్యవేక్షించే ఆరోగ్య సిబ్బంది రక్షణ కోసం ఐఐటీ-బాంబే పరిశోధకుల బృందం డిజిటల్ స్టెతస్కోప్ ను ఆవిష్కరించింది. బ్లూటూత్ ద్వారా దూరం నుంచే రోగి హృదయ స్పందనలను నమోదు చేస్తుంది ఈ స్టెత్. ఈ స్పందనలను గ్రాఫ్ వంటి దృశ్యరూపంలోనూ చూడవచ్చు.

VIRUS-IIT-STETHOSCOPE
బ్లూటూత్ స్టెతస్కోప్
author img

By

Published : Apr 11, 2020, 12:49 PM IST

కరోనా కట్టడి చర్యల్లో భౌతిక దూరం పాటించటం ముఖ్యం. కానీ కరోనా బాధితులను పర్యవేక్షించే వైద్యులకు మాత్రం ఈ అవకాశం ఉండదు. వారికి వైరస్ సోకే అవకాశమున్న నేపథ్యంలో ఐఐటీ-బాంబేకు చెందిన బృందం ఓ సరికొత్త ఆవిష్కరణ చేసింది.

హృదయ స్పందనను వినేందుకు డిజిటల్ స్టెతస్కోప్​ను తయారు చేసింది ఈ బృందం. ఛాతిపై పెట్టాల్సిన అవసరం లేకుండా దూరం నుంచే హృదయ స్పందనలను లెక్కించవచ్చని చెబుతున్నారు. దీనివల్ల కరోనా బాధితుల నుంచి ఆరోగ్య సిబ్బందికి వైరస్ సోకే ప్రమాదం తగ్గుతుందని అంటున్నారు.

బ్లూటూత్ ద్వారా..

రోగి ఛాతి నుంచి గుండె కొట్టుకునే శబ్దాన్ని బ్లూటూత్ ద్వారా వైర్‌లెస్‌గా వైద్యుడు వినే సదుపాయం ఈ డిజిటల్ స్టెత్​లో అమర్చారు. ఫలితంగా రీడింగులను తీసుకోవడానికి రోగి దగ్గరకు వెళ్ళాల్సిన అవసరం లేదని ఈ బృంద సభ్యులు తెలిపారు.

"కరోనా వైరస్ బారిన పడిన వ్యక్తికి శ్వాసకోశంలో సమస్యలు తలెత్తుతాయి. ఛాతి చేసే శబ్దాలు వినేందుకు వైద్యులు సంప్రదాయ స్టెతస్కోప్​ను ఉపయోగిస్తారు. వీటి ద్వారా వ్యాధి ఏ దశలో ఉందో గుర్తిస్తారు. కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు. దూరం నుంచే హృదయ స్పందనలను గుర్తించవచ్చు."

- ఆదర్శ, ఐఐటీ-బాంబే బృంద సభ్యులు

ఈ డిజిటల్ స్టెతస్కోప్ ఆవిష్కరణపై పేటెంట్ హక్కులు కూడా ఐఐటీ-బాంబే బృందం పొందింది. ఈ మేరకు 'ఆయుడివైస్' అనే అంకుర సంస్థను ప్రారంభించిందీ టీమ్. ఇప్పటికే 1,000 స్టెతస్కోప్​లను దేశంలో వివిధ ఆసుపత్రులకు అందించింది. ఈ స్టెతస్కోప్​ను.. రిలయన్స్, పీడీ హిందుజా ఆసుపత్రుల వైద్యుల సలహాలతో రూపొందించారు.

ఎలా పనిచేస్తుంది..

ఈ డిజిటల్ స్టెత్​లో ఒక ట్యూబుకు రెండు ఇయర్ పీస్​లు (చెవిలో పెట్టుకునేవి) ఉంటాయి. ఈ ట్యూబ్ రోగి శరీరం నుంచి శబ్దాలను గుర్తించి పంపిస్తుంది. దీని వెనక ఉన్న ఇతర శబ్దాలను తొలగిస్తుంది.

ఈ స్టెతస్కోప్​తో మరో ప్రయోజనం కూడా ఉంది. శరీరం నుంచి వచ్చే శబ్దాలను ఫిల్టర్ చేసి ఎలక్ట్రానిక్ సిగ్నల్​గా మారుస్తుంది. దీని వల్ల మరింత స్పష్టంగా శబ్దాలను వినవచ్చు.

ఈ సిగ్నల్​.. ల్యాప్ ట్యాప్ లేదా స్మార్ట్ ఫోన్​లోని ఫోనోకార్డియాగ్రామ్​పై కనిపిస్తుంది. సంప్రదాయ స్టెతస్కోప్​తో శబ్దాలను మాత్రమే వినగలం. ఒక చోటు నుంచి ఇంకో చోటుకి మార్చలేం. గ్రాఫ్ వంటి దృశ్య రూపం కూడా సాధ్యం కాదు.

ఇదీ చూడండి: 'విటమిన్​-డితో పురుషుల్లో గుండె సమస్యలకు చెక్​'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.