దేశంలో కరోనా బాధితుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. అయితే ఒక్కరోజులో వెలుగుచూస్తున్న కేసుల సంఖ్యలో వరుసగా మూడో రోజు తగ్గుదల కనిపించింది. తాజాగా 83,809 మంది మహమ్మారి బారిన పడ్డారు. 1,054 మంది మృత్యువాత పడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 49 లక్షల 30 వేలు దాటింది.
కొవిడ్ బాధితులు పెరుగుతున్న స్థాయిలో మహమ్మారి నుంచి కోలుకున్నవారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఇప్పటివరకు 38.59 లక్షల మంది వైరస్ను జయించడం వల్ల రికవరీ రేటు 78.28శాతానికి పెరిగింది. మరణాలు రేటు 1.64శాతం వద్ద ఉంది. ప్రభుత్వం అమలు చేసిన వ్యూహాలు సత్ఫలితాలను ఇవ్వడమే ఇందుకు కారణమని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
దేశంలో కరోనా నిర్ధరణ పరీక్షలు రోజూ సగటున 10 లక్షల 50వేలపైనే నిర్వహిస్తున్నారు. తాజాగా పరీక్షించిన 10 లక్షల 72వేల 845 నమూనాలతో కలిపి.. మొత్తం టెస్టుల సంఖ్య 5 కోట్ల 83 లక్షల 12 వేలు దాటింది.
ఇదీ చూడండి: బిహార్ బరి: పక్కా వ్యూహంతో ఎన్డీఏ-లాలూ పార్టీకి సవాళ్లెన్నో..