మహారాష్ట్రలో కరోనా ప్రభావం అంతకంతకూ తీవ్రమవుతోంది. రాష్ట్రంలో ఒక్కరోజు వ్యవధిలో 13మంది ప్రాణాలు కోల్పోయారు. మరణాల సంఖ్య మొత్తంగా 45కు చేరుకుంది. రాష్ట్రంలో కొత్తగా 112మందికి వైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది. దీంతో వైరస్ బాధితుల సంఖ్య 747కు చేరుకుంది.
దేశవ్యాప్తంగా ఒక్కరోజు వ్యవధిలో 505 కేసులు నమోదయ్యాయి. కేసుల సంఖ్య మొత్తంగా 3577కు చేరుకుంది. మృతుల సంఖ్య 83కు పెరిగింది. యాక్టివ్గా ఉన్న కేసుల సంఖ్య 3219కి చేరింది.
ఇదీ చూడండి: లాక్డౌన్ తర్వాత రైలు ఎక్కాలంటే ఇవి తప్పనిసరి!