ETV Bharat / bharat

కరోనా కలవరం: దేశంలో 723కు పెరిగిన మరణాలు - covid 19 outbreak

దేశవ్యాప్తంగా ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది మహమ్మారి కొవిడ్​. మృతుల సంఖ్య ఈ రోజు 723కు పెరిగింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఉత్తర్​ప్రదేశ్​ సహా పలు రాష్ట్రాల్లో ఈరోజు కేసులు గణనీయంగా పెరిగాయి.

COVID-19 death toll rises to 723 in country; cases climb to 23,452: Health ministry
కరోనా ఎఫెక్ట్​: దేశంలో 723కు పెరిగిన కేసులు
author img

By

Published : Apr 24, 2020, 7:27 PM IST

దేశంలో కరోనా క్రమంగా వేగం పెంచింది. ప్రజలు భయాందోళనతో బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. ఈరోజు కేసుల సంఖ్య 23,452కు చేరగా మరణాల సంఖ్య 723కు పెరిగింది.

COVID-19 death toll rises to 723 in country; cases climb to 23,452: Health ministry
దేశంలో కరోనా కేసు వివరాలు

కరోనా ప్రభావం ఇలా..

  • మాహారాష్ట్రలోని నాగ్​పుర్​లో మరో ఇద్దరికి వైరస్​ సోకగా.. నగరంలో కరోనా కేసుల సంఖ్య 100 దాటింది.
  • రాజస్థాన్​లో మరో నలుగురు కరోనాకు బలయ్యారు. కొత్తగా 44 మందికి వైరస్​ సోకింది. ఇప్పటివరకు 2,008 కేసులు నిర్ధరణ కాగా.. 32 మంది మృత్యువాత పడ్డారు.
  • ఉత్తర్​ప్రదేశ్​లో శుక్రవారం సాయంత్రం నాటికి వైరస్​ బారిన పడ్డ వారి సంఖ్య 1,604కు చేరింది. కొత్తగా 94 కేసులు నమోదు కావడం వల్ల అమాంతం బాధితులు పెరిగారు.
  • కర్ణాటకలో మరో 18 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 463 మందికి మహమ్మారి సోకింది.
  • తమిళనాడులో ఆదివారం నుంచి 4 రోజుల పాటు ఎలాంటి వెసులుబాటు లేకుండా సంపూర్ణ లాక్​డౌన్​ ప్రకటించారు సీఎం పళనిస్వామి. ప్రధానంగా చెన్నై, కోయంబత్తూర్, మధురైల్లో ఈ ఆంక్షలు అమలు కానున్నట్లు స్పష్టం చేశారు. ఈ 4 రోజులు కిరాణా దుకాణాలూ తెరవబోమని తేల్చి చెప్పారు. శుక్రవారం మరో ఇద్దరు వైరస్​కు బలికాగా.. 72 కేసులు నమోదయ్యాయి.
  • కేరళలో శుక్రవారం మరో నాలుగు పాజిటివ్​ కేసులు తేలగా.. కొవిడ్​ బాధితుల సంఖ్య 450కి పెరిగింది.
  • ఒడిశా రాష్ట్రవ్యాప్తంగా కేసుల సంఖ్య 90కి చేరింది.
  • బిహార్​లో కొత్తగా ఆరుగురికి మహమ్మారి సోకింది. వీరిలో 10 ఏళ్ల యువకుడు ఉండటం గమనార్హం. రాష్ట్రంలో మొత్తం 176 మంది వైరస్​ బారిన పడ్డారు.
  • బంగాల్​లో ముగ్గురు వైరస్​తో మరణించగా.. ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 18కి చేరినట్లు అధికారులు తెలిపారు. గడిచిన 24 గంటల్లో 51 కేసులు నమోదయ్యాయి. బంగాల్​లో మొత్తం 503 మందికి మహమ్మారి సోకింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.