తొలి దశ ప్రయోగ ఫలితాలు క్షుణ్నంగా పరిశీలించాకే అనుమతులిచ్చినట్లు తెలిపింది డీసీజీఐ. ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ శాస్త్రవేత్తలు అనుసరిస్తున్న ప్రయోగ విధానాన్నే.. సీరమ్ సంస్థ తయారు చేస్తున్న 'కొవిషీల్డ్' ప్రయోగంలోనూ పాటించనున్నారు.
రెండో దశ పూర్తి చేసుకన్నాక, మూడో దశ ప్రయోగం ప్రారంభించే ముందు డీసీజీఐకు భద్రత సమచారాన్ని సీరమ్ సమర్పించాల్సి ఉంటుంది. ఈ దశల్లో ఒక్క వ్యక్తిపై రెండు డోసులు ప్రయోగించాల్సి ఉంటుంది. మొదటి డోసు ఇచ్చిన 29వ రోజు రెండో డోసు వ్యాక్సిన్ ప్రయోగం జరగాలని వివరించింది డీసీజీఐ.
దేశంలోని 17 వేరు వేరు ప్రాంతాల్లో ఈ ప్రయోగం జరగునుంది. 18 ఏళ్లు నిండి, పూర్తి ఆరోగ్యంగా ఉన్న 1600 మందికి కోవిషీల్డ్ డోసులు ఇచ్చేందుకు అనుమతులు పొందింది సీరమ్.
ఇదీ చదవండి: యడియూరప్ప కూతురికి కరోనా.. ఆసుపత్రిలో సీఎం