ETV Bharat / bharat

2వేలు దాటిన కరోనా కేసులు- 50కిపైగా మృతులు

author img

By

Published : Apr 2, 2020, 8:59 PM IST

దేశంలో కరోనా కేసులు 2069కి చేరినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇందులో 1860 యాక్టివ్​ కేసులున్నట్లు స్పష్టం చేసింది. మరో 156 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకోగా.. 53 మంది మృత్యువాతపడ్డారు.

COVID-19 cases rises to 2069 in India, 53 deaths reported
దేశంలో 2వేలు దాటిన కరోనా కేసులు-50కిపైగా మృతులు

దిల్లీ నిజాముద్దీన్​ తబ్లీగీ జమాత్​ ప్రార్థనల కారణంగా దేశంలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాపంగా 2069 మంది కరోనాబారిన పడ్డట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇందులో 1860 యాక్టివ్​ కేసులుండగా.. 156 మంది కోలుకున్నట్లు స్పష్టం చేసింది. గుజరాత్​, మధ్యప్రదేశ్​, దిల్లీలో ఇవాళ మరికొందరు చనిపోయినందున దేశంలో కరోనా మృతుల సంఖ్య 53కు చేరినట్లు పేర్కొంది.

రాష్ట్రాలవారీగా మహారాష్ట్రలో అత్యధికంగా 335 కేసులు నమోదవగా.. 13 మంది మరణించారు. కేరళలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. మొత్తం 265 కేసులు నమోదయ్యాయి. తమిళనాడులోనూ ఒకరు మృత్యువాత పడగా.. మొత్తం 234 కేసులు నమోదైనట్లు అధికారులు స్పష్టం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.