మహారాష్ట్రలో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. మంగళవారం కొత్తగా 72 కేసులు నమోదయ్యాయి. ఒక్క ముంబయిలోనే అత్యధికంగా 52 మందికి వైరస్ సోకింది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 302 మంది ఈ మహమ్మారి బారినపడ్డారు.
దేశంలోనే ఒక్క రోజులో అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది. ముంబయితో పాటు, అహ్మద్‌నగర్‌లో 3, పుణె, ఠానే, విసాయ్, విరార్, కల్యాణ్- డొంబివాలి నగరాల్లో రెండు చొప్పున కేసులు నమోదయ్యాయి.