ఒకవేళ తల్లికి కరోనా ఉన్నా నిరభ్యంతరంగా బిడ్డకు పాలు ఇవ్వవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. తల్లిపాల ద్వారా కరోనా సోకదని చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ విషయాన్నే చెప్పిందని గుర్తు చేస్తున్నారు. అయితే పాలు ఇచ్చేటప్పుడు మాస్కులు, గ్లౌజులు ధరించడం వంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. పాలు ఇవ్వలేని పరిస్థితిలో తల్లి ఉంటే బ్రెస్ట్ మిల్క్ బ్యాంకుల నుంచి పాలు తెప్పించి పిల్లలకు పట్టవచ్చని చెబుతున్నారు.
కొందరు తల్లుల నుంచి పాలను సేకరించి, అవి ఇతర పిల్లలకు అందేలా చేయడం కోసమే బ్రెస్ట్ మిల్క్ బ్యాంకులు ఏర్పాటయ్యాయి. ఇలా సేకరించిన పాలను 62.5 డిగ్రీల సెల్సియస్ వద్ద వేడి చేసి తరువాత చల్లబరుస్తారు. శాస్త్రీయ పద్ధతుల్లో పాశ్చురైజేషన్ చేయడం వల్ల కరోనా వైరస్ నశిస్తుందని హూమ్యన్ మిల్క్ బ్యాంకింగ్ అసోసియేషన్ భారత దేశ శాఖ అధ్యక్షుడు కేతన్ భారద్వ చెప్పారు.
అందువల్ల ఎలాంటి సందేహాలు లేకుండా ఈ పాలను కూడా పిల్లలకు పట్టవచ్చని తెలిపారు. ఒకవేళ ఇతర మహిళ పాలను నేరుగా పట్టాల్సి వస్తే ఆ మహిళకు కరోనా నెగిటివ్ ఉంటే మంచిదని మరో నిపుణుడు అభిప్రాయపడ్డారు.