ETV Bharat / bharat

కుష్టురోగానికి వాడే డ్రగ్​తో కరోనాకు చికిత్స! - corona latest updates

మైకోబాక్టీరయమ్​​​ డబ్ల్యూ డ్రగ్​పై నిర్వహిస్తున్న ట్రయల్స్​లో ఆశాజనక ఫలితాలు లభించినట్టు భోపాల్​ ఎయిమ్స్​​ వైద్యులు తెలిపారు. ఈ డ్రగ్​తో చికిత్స అందించిన ముగ్గురు కరోనా రోగులు కోలుకుని డిశ్చార్జి అయినట్లు వెల్లడించారు. మరిన్ని ట్రయల్స్ నిర్వహిస్తే దీనిని దేశవ్యాప్తంగా ఉపయోగించే విషయంపై స్పష్టత వస్తుందని చెబుతున్నారు.

AIIMS Bhopal claims good results in drug trial
కుష్టురోగాని వాడే డ్రగ్​తో కరోనా చికిత్స-ఫలితాలు ఆశాజనకం
author img

By

Published : May 16, 2020, 5:09 PM IST

కరోనా మహమ్మారికి చికిత్సపై పలు కీలక విషయాలు వెల్లడించారు మధ్యప్రదేశ్​లోని భోపాల్​ ఎయిమ్స్ వైద్యులు. వైరస్​ సోకి ఆరోగ్యం తీవ్రంగా విషమించిన రోగులకు మైకోబాక్టీరియమ్​​ డబ్ల్యూ(ఎమ్​డబ్ల్యూ) డ్రగ్​తో చికిత్స అందించగా.. మంచి ప్రభావం చూపినట్లు పేర్కొన్నారు. ఈ ట్రయల్స్ ఆశాజనక ఫలితాలు ఇస్తున్నట్లు, ప్రయోగాలను విస్త్రతం చేస్తే మరింత స్పష్టత వస్తుందని సీనియర్​ వైద్యులు వివరించారు.

గతకొద్ది రోజులుగా భోపాల్​ ఎయిమ్స్​లో మైకోబాక్టీరియమ్​​ డబ్ల్యూ డ్రగ్​ క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు ముగ్గురు రోగులు కోలుకుని డిశ్చార్జ్​ ఆస్పత్రి డైరెక్టర్ సర్మాన్​ సింగ్ తెలిపారు. మొత్తం నలుగురు రోగులు క్లీనికల్​ ట్రయల్స్​కు ఒప్పుకున్నట్లు పేర్కొన్నారు.

జపాన్​లో కరోనా చికిత్సకు ఉపయోగిస్తున్న ఫెవిపిరవిర్ డ్రగ్​ను త్వరలోనే భారత్​లోనూ పరీక్షించనున్నట్లు వెల్లడించారు సింగ్​. మైకోబాక్టీరియమ్​ డబ్ల్యూ డ్రగ్​పై మరిన్ని ట్రయల్స్​ నిర్వహించి ప్రభావం చూపినట్లు నిరూపితమైతే.. దేశవ్యాప్తంగా కొవిడ్ చికిత్సకు ఉపయోగించవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.

మైకోబాక్టీరియమ్ డబ్ల్యూ డ్రగ్​ను గతంలో కుష్టురోగం చికిత్సకు ఉపయోగించారు. ఇది కొవిడ్​పై ఏమేర ప్రభావం చూపుతుందో తెలుసుకునేందుకు కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్(సీఎస్​ఐఆర్​), కెడిలా ఫార్మా సంస్థలు సంయుక్తంగా ట్రయల్స్​ నిర్వహిస్తున్నట్లు సింగ్ చెప్పారు. దేశవ్యాప్తంగా మొత్తం మూడు ఆస్పత్రులలో మాత్రమే ఈ డ్రగ్​ను పరీక్షించేందుకు అధికారులు అనుమతులిచ్చారు. అందులో భోపాల్ ఎయిమ్స్​ ఒకటి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.