ఉత్తర్‌ప్రదేశ్‌లో అరుదైన సంఘటన జరిగింది. ఓ కరోనా బాధిత మహిళ ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది. రాష్ట్రంలోని గోరఖ్‌పుర్ బీఆర్డీ వైద్య కళాశాలలో ఈ సంఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు.
" నవజాత శిశువుల్లో ముగ్గురు ఆరోగ్యంగా ఉన్నారు. నాలుగో చిన్నారిని వెంటిలేటర్‌పై ఉంచారు. తల్లి కూడా ఆరోగ్యంగా ఉంది. దేవరియా జిల్లాలోని గౌరీ బజార్లో నివసిస్తున్న 26 ఏళ్ల మహిళ మంగళవారం రాత్రి వైద్య కళాశాలలోని ట్రామా సెంటర్‌కు చేరుకుని కరోనా పరీక్షలు చేయించుకుంది. ఈ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలింది. అత్యంత సమర్థమైన వైద్యులు, పారామెడికల్ బృందం వైద్యం అందించగా.. బుధవారం నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది. "
- గణేశ్ కుమార్, బీఆర్డీ వైద్య కళాశాల ప్రిన్సిపల్.
అయితే... నెలలు నిండకముందే డెలివరీ అయినట్లు వైద్యులు తెలిపారు. నలుగురు చిన్నారులు 980 గ్రాముల నుంచి 1.5 కిలోల వరకు బరువు ఉన్నట్లు చెప్పారు. ఇలాంటి కేసులు చాలా అరుదని, చాలా సవాలుతో కూడుకున్న డెలివరీగా పేర్కొన్నారు ప్రిన్సిపల్.
నలుగురు పిల్లల నమూనాలను కరోనా పరీక్షలకు పంపించినట్లు వైద్యులు చెప్పారు.