ETV Bharat / bharat

కరోనా ​జీవితకాల సవాల్-​ మీడియా ప్రముఖులతో వీసీలో మోదీ

కరోనా వైరస్​ జీవితకాల సవాల్​ లాంటిదన్నారు ప్రధాని నరేంద్రమోదీ. ప్రజలకు వైరస్​పై అవగాహన కల్పించడంలో సమాచార మాధ్యమాలు చేస్తున్న కృషిని అభినందించారు. దేశంలోని ప్రముఖ మీడియా ప్రతినిధులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్​లో మోదీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

modi media conference
మోదీ మీడియా సమావేశం
author img

By

Published : Mar 23, 2020, 5:50 PM IST

Updated : Mar 23, 2020, 6:16 PM IST

కరోనా ​జీవితకాల సవాల్-​ మీడియా ప్రముఖులతో వీసీలో మోదీ

ప్రాణాంతక కరోనాను వినూత్నమైన పరిష్కార మార్గాల ద్వారా ఎదుర్కోవచ్చని అభిప్రాయపడ్డారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. వైరస్​ను 'జీవితకాల సవాల్​'గా అభివర్ణించారు ప్రధాని. దేశంలోని ప్రముఖ మీడియా సంస్థల ప్రతినిధులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్​లో పలు సూచనలు చేశారు మోదీ.

"రిపోర్టర్లు, కెమెరామెన్లు, టెక్నీషియన్ల విరామం లేని కృషి దేశానికి గొప్ప సేవ వంటిది. సరైన కమ్యూనికేషన్​ ద్వారా ప్రజల్లోని నిరాశావాదం, భయాన్ని మీడియా తొలగించాలి. కొవిడ్-19 అనేది జీవితకాల ముప్పు. దీన్ని సరికొత్త, వినూత్న పరిష్కారాల ద్వారా ఎదుర్కోవచ్చు."

-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

కరోనా వైరస్ తీవ్రతను అర్థం చేసుకొని... వైరస్​పై అవగాహన పెంచడంలో మీడియా చేసిన కృషిని మోదీ కొనియాడారు. సుదీర్ఘమైన ఈ యుద్ధాన్ని ఎదుర్కోవడానికి తాజా సమాచారాన్ని ప్రజలకు అర్థమయ్యే భాషలో ప్రజలకు అందించాలని పేర్కొన్నారు. మీడియా అందించే సమాచారం ప్రభుత్వానికి సైతం కీలకమైన ఫీడ్​బ్యాక్​లా ఉంటుందన్నారు. శాస్త్రీయమైన రిపోర్టులను ప్రజలకు తెలియజేయాలని కోరారు. రిపోర్టర్లకు ప్రత్యేకమైన మైకులు ఇచ్చి... మీటరు దూరం పాటిస్తూ ముఖాముఖి తీసుకోవాలని సూచించారు.

మీడియా ప్రతినిధుల సూచనలు..

మీడియా ప్రతినిధులు సైతం ప్రధానికి పలు సూచనలు చేశారు. తరచుగా జాతినుద్దేశించి మాట్లాడాలని కోరారు. కొవిడ్​ నుంచి కోలుకున్న వారిపై సానుకూల కథనాలు తన ప్రసంగంలో ఉదహరించాలని సూచించారు. వదంతులను అరికట్టడానికి 24 గంటలు అందుబాటులో ఉండే వైద్యులతో కూడిన ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరారు.

మీడియా ప్రతినిధుల సూచనలకు ధన్యవాదాలు తెలిపిన ప్రధాని... కరెన్సీ ద్వారా వైరస్​ వ్యాప్తి జరగకుండా డిజిటల్ చెల్లింపులపై అవగాహన కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో ప్రధానితో పాటు కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్ పాల్గొన్నారు.

ఇదీ చదవండి: మాజీ ప్రధానికి సెలవులు మంజూరు.. కారణం ఇదేనా?

Last Updated : Mar 23, 2020, 6:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.