ETV Bharat / bharat

కేరళలో కరోనా ఉగ్రరూపం- కొత్తగా 10,606 కేసులు - India cases latest news

దక్షిణ భారత​ రాష్ట్రాల్లో కొవిడ్​ కేసులు భారీగా పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. కేరళలో కొత్తగా 10వేల మందికిపైగా వైరస్​ బారినపడ్డారు. తమిళనాడు, కర్ణాటక​ రాష్ట్రాల్లో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. అటు మహారాష్ట్ర, ఉత్తర్​ప్రదేశ్​, బంగాల్​లోనూ బాధితుల సంఖ్య ఎక్కువగానే ఉంది.

Covid 19: 10,606 new covid 19 cases reported in Kerala
కేరళలో కరోనా ఉగ్రరూపం- కొత్తగా 10,606 కేసులు
author img

By

Published : Oct 7, 2020, 8:12 PM IST

Updated : Oct 8, 2020, 12:48 AM IST

దేశవ్యాప్తంగా కరోనా కేసుల్లో తగ్గుదల కనిపిస్తున్నప్పటికీ... కొన్ని రాష్ట్రాల్లో మాత్రం వైరస్​ విజృంభణ కొనసాగుతోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో తాజాగా 14,578 కేసులు నమోదు కాగా... 355మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 14 లక్షల 80 వేలు దాటింది.

కర్ణాటకలో కరోనా విశ్వరూపం దాల్చుతోంది. ఒక్కరోజే 10,947 కేసులు వెలుగుచూశాయి. మరో 113 మంది మరణించారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 5 లక్షల 43 వేలకు చేరువైంది.

కేంద్ర మంత్రికి కరోనా

పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్​ జోషికి కొవిడ్​ సోకింది. ఆయనే ఈ విషయాన్ని తెలియజేశారు. వైద్యుల సలహా మేరకు స్వీయనిర్బంధంలో ఉన్నట్లు తెలిపారు.

కేరళలో మరో మంత్రికి వైరస్​

కేరళలో ఒక్కరోజే 10,606మందికి వైరస్​ సోకింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2 లక్షల 52 వేలు దాటింది.

కేరళలో మరో మంత్రి వైరస్ బారినపడ్డారు. రాష్ట్ర విద్యుత్​​శాఖ మంత్రి ఎంఎం మణికి కరోనా సోకగా.. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సామాజిక మాధ్యమం ద్వారా వెల్లడించారు. దీంతో ఇప్పటివరకు నలుగురు మంత్రులకు కరోనా సోకింది.

5 వేలకు పైనే..

తమిళనాడులో కొత్తగా 5,447మందికి మహమ్మారి సోకింది. మరో 67మంది మృత్యువాత పడ్డారు. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 6 లక్షల 36 వేలకు చేరువైంది.

  • ఉత్తర్​ప్రదేశ్​లో మరో 3,561 మందికి కరోనా పాజిటివ్​గా తేలింది. మరో 47మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4 లక్షల 24 వేలు దాటింది.
  • దిల్లీలో తాజాగా 35మంది కొవిడ్​తో ప్రాణాలు కోల్పోయారు. మరో 2,871 మందికి వైరస్ పాజిటివ్​గా తేలింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 3 లక్షలకు చేరువైంది.
  • ఒడిశాలో కొత్తగా 2,995 కొవిడ్​ కేసులు నమోదవగా.. 18మంది చనిపోయారు.
  • రాజస్థాన్​లో ఒక్కరోజే 2,151మందికి కొవిడ్​ పాజిటివ్​గా తేలింది. 16మంది మరణించారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య లక్షా 50 వేలు దాటింది.
  • మధ్యప్రదేశ్​లో మరో 1,639మందికి కరోనా సోకింది. 30మంది ప్రాణాలు కోల్పోయారు.
  • గుజరాత్​లో 1,311 కేసులు వెలుగుచూశాయి. మరో 9మంది మృతి చెందారు.

తగ్గుతున్న యాక్టివ్​ కేసులు

దేశంలో కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య పెరిగి.. యాక్టివ్​ కేసుల సంఖ్య తగ్గుతోందని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్​ తెలిపారు. ప్రస్తుతం రికవరీ రేటు 85.2శాతానికి పెరిగిందని చెప్పారు. ఇది కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం అనుసరించిన వ్యూహాల ఫలితమేనని ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు 8కోట్లకు పైగా కొవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి: మంచి చెప్పినా వినని ముగ్గురు ముష్కరులు హతం

Last Updated : Oct 8, 2020, 12:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.