ETV Bharat / bharat

'కొవాగ్జిన్'​కు మరో కీలక అనుమతి!

author img

By

Published : Aug 22, 2020, 6:08 PM IST

Updated : Aug 22, 2020, 8:10 PM IST

భారత్​ బయోటెక్​ సంస్థ రూపొందిస్తున్న కొవాగ్జిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ నిబంధనల్లో మార్పు చేసేందుకు ప్రభుత్వ ప్యానెల్‌ అంగీకరించిందని సమాచారం. సాధారణంగా కండరాలు, భుజాలకు టీకా ఇస్తారు. అయితే కొవాగ్జిన్​ను చర్మం కింది పొరలో టీకా ఇచ్చే ట్రయల్స్​కు అనుమతినిచ్చినట్టు తెలుస్తోంది.

covaxin-latest-update-intra-dermal-rout
చర్మం కింది పొరకు కొవాగ్జిన్​ టీకా ట్రయల్స్‌

కరోనా వైరస్‌కు 'కొవాగ్జిన్' టీకా రూపొందిస్తున్న భారత్‌ బయోటెక్‌ సంస్థకు మరో అనుమతి లభించింది. కొవాగ్జిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ నిబంధనల్లో మార్పు చేసేందుకు ప్రభుత్వ ప్యానెల్‌ అంగీకరించిందని తెలిసింది. చర్మం కింది పొరలో టీకా ఇచ్చే ట్రయల్స్‌ చేపట్టేందుకు అనుమతి ఇచ్చిందని సమాచారం.

సాధారణంగా చికిత్స చేసేందుకు టీకాను అనేక మార్గాలు ఇస్తారు. ఎక్కువగా కండరాలకు ఇస్తారు. భుజాలు, పిరుదులకు టీకా ఇవ్వడం మనం చూస్తూనే ఉంటాం. దీనిని ఇంట్రామస్కులర్‌ రూట్‌ అంటారు. కొన్ని టీకాలను సెలైన్‌, నోరు, నరాల ద్వారా ఇస్తారు. అలాగే కొన్నింటికి చర్మం కింద వున్న పొరకు ఇస్తారు. దీనినే 'ఇంట్రాడెర్మల్‌ రూట్' అంటారు. రెండు షరతులకు లోబడి కొవాగ్జిన్‌తో ఇలా ట్రయల్స్‌ చేపట్టేందుకు అనుమతులు లభించాయని వార్తలు వస్తున్నాయి.

చర్మం కింద పొరకు టీకా ఇవ్వడానికి అత్యంత ప్రాధాన్యం ఉంది. ఎందుకంటే కండరాలకు ఎక్కువ ఔషధాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. అదే చర్మం కింద పొరకైతే స్వల్ప మోతాదు సరిపోతుంది. ఎక్కువ మందికి టీకా అందుబాటులోకి వస్తుంది. ధర సైతం తగ్గుతుంది.

భారత్‌ లాంటి అధిక జనాభా, పేదరికం ఉన్న దేశాలకు తక్కువ ధరకే టీకా మందు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాగా దేశవ్యాప్తంగా 12 ఆస్పత్రుల్లో 1125 మంది రోగులపై కొవాగ్జిన్‌ మొదటి, రెండో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహిస్తున్నారు. త్వరలోనే మూడో దశ ప్రయోగాలు మొదలవుతాయని తెలుస్తోంది.

ఇదీ చూడండి:- భారత్​ బయోటెక్​ 'కొవాగ్జిన్'​ తొలిదశ ట్రయల్స్​ పూర్తి

Last Updated : Aug 22, 2020, 8:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.