ETV Bharat / bharat

'కమలేశ్' ఘటనపై కేంద్రానికి దిల్లీ హైకోర్టు నోటీసులు - ఉత్తరఖండ్ యువకుడు

అబుధాబిలో మరణించిన ఉత్తరాఖండ్​కు చెందిన కమలేశ్​ మృతదేహాన్ని తిప్పిపంపడాన్ని ప్రశ్నిస్తూ కేంద్రానికి దిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అన్ని అనుమతులు ఉన్నా మృతదేహాన్ని అతని కుటుంబ సభ్యులకు ఎందుకు అప్పగించలేదో వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

Court
దిల్లీ హైకోర్టు
author img

By

Published : Apr 26, 2020, 12:29 PM IST

అబుధాబిలో మరణించిన ఉత్తరాఖండ్​కు చెందిన ఓ యువకుడి మృతదేహాన్ని తిప్పిపంపటంపై కేంద్రానికి దిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మృతదేహాన్ని అప్పగించేందుకు అతడి కుటుంబ సభ్యులు విదేశాంగ శాఖ నుంచి అన్ని అనుమతులు తీసుకున్నా హోంశాఖ ఎందుకు నిరాకరించిందని ప్రశ్నించింది.

ఉత్తరాఖండ్​లోని తెహ్రీ గర్వాల్​కు చెందిన కమలేశ్​​ భట్​.. అబుధాబికి ఉపాధి నిమిత్తం వెళ్లాడు. అక్కడే ఓ సంస్థలో పనిచేస్తున్న అతడు.. ఏప్రిల్​ 17న గుండెపోటుతో మరణించాడు. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు ఓ వ్యక్తి సాయంతో స్వదేశానికి అతడి మృతదేహాన్ని భారత్​కు​ రప్పించారు. లాక్​డౌన్ నిబంధనలు నేపథ్యంలో గంటల వ్యవధిలో అబుధాబికే మృతదేహాన్ని తిప్పి పంపేశారు భారత అధికారులు.

అధికారుల తీరుపై కమలేష్​ కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కమలేశ్ మృతదేహానికి సంబంధించి ప్రస్తుత పరిస్థితి ఏంటన్నదీ తెలియకుండా ఉందని ఆవేదన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో కమలేశ్​ సోదరుడు విమలేశ్ భట్ దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. మృతదేహాన్ని ఇచ్చేందుకు తిరస్కరించిన ఇమ్మిగ్రేషన్ అధికారుల నిర్ణయాన్ని సవాల్​ చేశారు.

అత్యవసర విచారణ..

విమలేశ్​ వ్యాజ్యంపై జస్టిస్ సంజీవ్ సచ్​దేవ నేతృత్వంలోని ధర్మాసనం ఆదివారం ప్రత్యేకంగా విచారణ చేపట్టింది. అన్ని అనుమతులు ఉన్నా అధికారులు తిరస్కరించి.. అదే విమానంలో తిప్పిపంపడమేమిటని ప్రశ్నించింది.

సంబంధిత రాయబార కార్యాలయం సాయంతో మృతదేహం ఎక్కడ ఉందనే విషయాన్ని తెలుసుకుంటామని ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ మహిందర్ ఆచార్య తెలిపారు. ఈ విషయంపై భారత ప్రభుత్వం అత్యున్నత స్థాయిలో చర్చించిందని కోర్టుకు విన్నవించారు.

ఇటువంటి పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలపై విధివిధానాలనూ రూపొందించినట్లు కోర్టు దృష్టికి తెచ్చారు. అనంతరం తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది హైకోర్టు.

గుండెపోటే కారణం..

అబుధాబిలో ఉత్తరాఖండ్​, పంజాబ్​ రాష్ట్రాలకు చెందిన ముగ్గురి మృతదేహాలు ఉన్నట్లు సమాచారం. వీరిని ఏప్రిల్ 22, 23 తేదీల్లో భారత్​కు పంపగా.. అదే విమానంలో తిప్పి పంపారు. ఈ నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులు విమానాశ్రయానికి వెళ్లగా వారికి నిరాశే మిగిలింది.

వీరిలో ఒకరికి కరోనా ఉన్నట్లు తెలుస్తోంది. కమలేశ్ శవ పంచనామా నివేదిక ప్రకారం గుండెపోటు ద్వారా మరణించినట్లు 'ఈటీవీ భారత్'​ గుర్తించింది.

ఈటీవీ భారత్​ కథనంతో..

దీనిపై కథనం ప్రచురించిన ఈటీవీ భారత్.. విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. హోంశాఖ, విదేశీ వ్యవహారాల శాఖను సంప్రదించింది. కమలేశ్​ మృతదేహాన్ని తల్లిదండ్రులకు అందించడంలో వైఫల్యానికి సమధానమివ్వాలని కోరింది. అబుధాబిలోని భారత ఎంబసీ సరైన సహకారం అందించకపోవడాన్ని ప్రశ్నించింది.

ఈ నేపథ్యంలోనే మృతదేహాల తరలింపుపై కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. విదేశాల్లో కరోనా సోకి మరణించిన భారతీయుల మృతదేహాలను దేశానికి తీసురానున్నట్లు స్పష్టం చేసింది. ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి భారత్​కు తరలించవచ్చని పేర్కొంది.

ఇదీ చూడండి: 'ఈటీవీ భారత్'​ చొరవతో మృతదేహాల తరలింపునకు చర్యలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.