ETV Bharat / bharat

ఉన్నావ్​ కేసు దోషి సెంగార్​కు ఈనెల 20న శిక్ష ఖరారు - kuldeep sengar latest news

ఉన్నావ్ అత్యాచార కేసులో కుల్​దీప్​ సెంగార్​కు శిక్ష విధింపుపై దిల్లీ కోర్టులో వాదనలు జరిగాయి. ఈనెల 20న శిక్ష ఖరారు చేయనుంది న్యాయస్థానం. సెంగార్​ ఆర్థిక పరిస్థితి తెలుసుకునేందుకు ఎన్నికల నామినేషన్​ పత్రాలు సమర్పించాలని కోర్టు ఆదేశించింది.

unnav case
ఉన్నావ్​ కేసు దోషి  సెంగార్​కు ఈనెల 20న శిక్ష!
author img

By

Published : Dec 17, 2019, 2:31 PM IST

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్‌ అత్యాచార కేసులో దోషిగా తేలిన భాజపా బహిష్కృత ఎమ్మెల్యే కులదీప్‌ సింగ్‌ సెంగార్‌కు ఈ నెల 20న శిక్ష ఖరారు చేయనుంది దిల్లీ జిల్లా కోర్టు. సెంగార్‌కు శిక్ష విధింపుపై ఇవాళ న్యాయస్థానంలో వాదనలు జరిగాయి. కులదీప్‌కు జీవిత ఖైదు విధించాలని సీబీఐ వాదనలు వినిపించింది. న్యాయం కోసం వ్యవస్థపై ఒక వ్యక్తి చేసిన పోరాటం కనుక ఈ కేసులో కులదీప్‌కు గరిష్ఠ శిక్ష అయిన జీవిత ఖైదు విధించాలని కోరింది. అత్యాచార బాధితురాలికి సరైన పరిహారం చెల్లించాలంది.

ఈ నేపథ్యంలో కులదీప్‌ సెంగార్‌ ఆర్థిక పరిస్థితి తెలుసుకునేందుకు ఎన్నికల నామినేషన్‌ పత్రాలు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. బాధితురాలికి పరిహారం చెల్లింపునకు సెంగార్‌ ఆర్థిక పరిస్థితిని న్యాయస్థానం పరిశీలించనుంది. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది.

ఉద్యోగం కావాలని వెళ్లిన 17 ఏళ్ల బాలికపై 2017 జూన్‌ 4న కులదీప్‌ సెంగార్‌ అత్యాచారం చేసినట్లు రుజువైంది. భారతీయ శిక్షా స్మృతి, పోక్సో చట్టాల కింద కులదీప్‌ సెంగార్‌కు శిక్ష పడనుంది.

ఇదీ చూడండి: 'పౌర హింస'పై తేల్చాల్సింది హైకోర్టులే: సుప్రీం

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Doha, Qatar. 17th December 2019.
++++SHOTLIST AND FURTHER INFORMATION TO FOLLOW++++
1. 00:00
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
SOURCE: SNTV
DURATION: 01:44
STORYLINE:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.