ఉత్తర్‌ప్రదేశ్‌లోని కుషీనగర్ జిల్లాలో దేశంలోనే మొట్టమొదటి సారి ట్రాన్స్జెండర్ల కోసం విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందులో ఒకటో తరగతి నుంచి పీజీ వరకు చదువుకునే సదుపాయాన్ని కల్పించనున్నారు. అంతే కాకుండా పరిశోధనలు చేసి పీహెచ్డీ పట్టాను కూడా పొందవచ్చు. అఖిల భారతీయ కిన్నర్ శిక్షా సేవా ట్రస్టు (అఖిల భారత ట్రాన్స్‌జెండర్ విద్య సేవా ట్రస్ట్) ఈ విశ్వవిద్యాలయాన్ని నిర్మిస్తోంది.
ఇది ట్రాన్స్‌జెండర్ వర్గానికి దేశంలోనే మొట్టమొదటి ప్రత్యేక విశ్యవిద్యాలయం. ఇప్పటికే నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. వచ్చే ఏడాది జనవరి 15న ఇద్దరు ట్రాన్స్‌జెండర్ పిల్లలకు ప్రవేశం కల్పించనున్నాము. ఫిబ్రవరి, మార్చి నెలల్లో తరగతులు ప్రారంభమవుతాయి.
-డా.కృష్ణ మోహన్ మిశ్రా, ట్రస్టు అధ్యక్షులు
ఈ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభిస్తున్నందుకు ట్రాన్స్జెండర్లు ఆనందం వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి: సివిల్ సర్వీసెస్ ఫలితాలు విడుదల