పాకిస్థాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐకి చెందిన ఓ ఏజెంట్ సహా మరో నలుగురు అనుమానితులు దేశంలో ప్రవేశించారని సమాచారం. ఈ నేపథ్యంలో రాజస్థాన్-గుజరాత్ సహా దేశవ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు. అఫ్గానిస్థాన్ పాస్పోర్టులతో అనుమానస్పద వ్యక్తులు భారత్లో ప్రవేశించారని తెలుస్తోంది.
ఈ విషయంపై రాజస్థాన్లోని సిరోహి జిల్లా ఎస్పీ ఓ ప్రకటనను విడుదల చేశారు.
"అఫ్గానిస్థాన్ పాస్పోర్టులతో ఓ ఐఎస్ఐ ఏజెంట్ సహా నలుగురు అనుమానితులు దేశంలో ప్రవేశించారు. వారు ఏ సమయంలోనైనా ఉగ్ర కార్యకలాపాలకు దిగవచ్చు."-కల్యాణ్మల్ మీనా, సిరోహి జిల్లా ఎస్పీ.
హోటళ్లు, బస్టాండులు వంటి జనసంచారం ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో తనిఖీలు ముమ్మరంగా చేపట్టాలని పోలీసులకు సూచించారు. రహదారులపై చెక్పాయింట్లు ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీలు చేయలని ఆదేశించారు.
ఇదీ చూడండి: 'రాజీవ్ నిర్ణయాలే సమాచార విప్లవానికి పునాది'