ETV Bharat / bharat

రక్షణ విపణిపై కొత్త ముద్ర

ఆసియాలోనే అతిపెద్ద రక్షణ ఉత్పత్తుల ప్రదర్శనకు లఖ్‌నవూ వేదికైంది. సాబ్‌ (స్వీడిష్‌ రక్షణ ఉత్పత్తుల సంస్థ), ఇజ్రాయిల్‌ ఏరో స్పేస్‌ ఇండస్ట్రీస్‌, లాక్‌ హీడ్‌ మార్టీన్‌ (అమెరికాకు చెందిన వైమానిక ఉత్పత్తుల దిగ్గజ సంస్థ) వంటి 172 అంతర్జాతీయ కంపెనీలతోపాటు భారత్‌కు చెందిన రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) ఇందులో పాల్గొన్నాయి. ఉగ్రవాదంపై పోరాటం, సముద్ర జలాల్లో నిఘా, సహకారం శిక్షణ వంటి పలు అంశాల్లో అన్ని దేశాలు పరస్పరం చేదోడు వాదోడుగా ఉండాలని నిర్ణయించాయి.

defence
రక్షణ విపణిపై కొత్త ముద్ర
author img

By

Published : Feb 15, 2020, 8:35 AM IST

Updated : Mar 1, 2020, 9:39 AM IST

రక్షణ రంగంలో సహకారం ఇచ్చిపుచ్చుకునేందుకు భావసారూప్యం కలిగిన దేశాలన్నీ లఖ్‌నవూ కేంద్రంగా ఇటీవల ఒకే వేదికమీదకు వచ్చాయి. సీమాంతర ఉగ్రవాదం, మహిళలను కిడ్నాప్‌ చేసి వారిని దేశాలు దాటించే ముఠాలు, సైబర్‌ దాడులు అంతర్జాతీయంగా వేగంగా విస్తరిస్తున్న తరుణంలో- వాటిని దీటుగా ఎదుర్కొనే రక్షణ వ్యూహాలను సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది. రక్షణ ఉత్పత్తుల రంగంలో నూతన ఆవిష్కరణలకు, వివిధ దేశాల శక్తి సామర్థ్యాలకు దర్పణం పట్టే ‘డిఫెన్స్‌ ఎక్స్‌పో-2020’లో 40కిపైగా దేశాల రక్షణ మంత్రులు, ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ ప్రదర్శన చివరి రోజున మేజర్‌ అనూప్‌ మిశ్ర ప్రదర్శించిన ‘గన్‌షాట్‌ లొకేటర్‌’ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. దానికి 400 మీటర్ల పరిధిలో ఎవరైనా తూటా పేలిస్తే అది కచ్చితంగా ఎక్కడి నుంచి ప్రయోగించారో చెప్పేస్తుంది.

చీకట్లో శత్రువుతో అత్యంత సమీపంలో జరిపే ఉగ్ర నిరోధక ఆపరేషన్లలో ఇది రక్షణ బలగాల ప్రాణాలు కాపాడే సంజీవని అనే చెప్పవచ్చు. అంతర్జాతీయ విపణినుంచి దీన్ని దిగుమతి చేసుకుంటే ఒక్కోదానికి రూ.65 లక్షలు చెల్లించాల్సిందే! కానీ, సైన్యానికి చెందిన ‘కాలేజ్‌ ఆఫ్‌ మిలిటరీ ఇంజినీరింగ్‌’ బృందం మరో ప్రైవేటు సంస్థతో కలిసి దేశీయంగా దీనిని అభివృద్ధి చేసింది. ఫలితంగా దీని ధర మూడు లక్షల రూపాయలకు దిగివచ్చింది. రక్షణ రంగంలో ‘భారత్‌లో తయారీ’ (మేకిన్‌ ఇండియా)కి ఉన్న ప్రాధాన్యం చెప్పేందుకు ఈ ఒక్క ఉదాహరణ చాలు.

అంతర్జాతీయ అవసరాలకు దీటుగా ఉత్పత్తులు

లఖ్‌నవూ ప్రదర్శన అనేక కీలకాంశాలకు కేంద్రంగా నిలిచింది. ఇది ఆసియాలోనే అతిపెద్ద రక్షణ ఉత్పత్తుల ప్రదర్శన కావడంతో సాబ్‌ (స్వీడిష్‌ రక్షణ ఉత్పత్తుల సంస్థ), ఇజ్రాయిల్‌ ఏరో స్పేస్‌ ఇండస్ట్రీస్‌, లాక్‌ హీడ్‌ మార్టీన్‌ (అమెరికాకు చెందిన వైమానిక ఉత్పత్తుల దిగ్గజ సంస్థ) వంటి 172 అంతర్జాతీయ కంపెనీలతోపాటు భారత్‌కు చెందిన రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) సైతం పాల్గొంది. వీటితోపాటు ప్రపంచంలోని వివిధ దేశాలనుంచి తరలివచ్చిన 852 దేశీయ రక్షణ ఉత్పత్తుల తయారీ కంపెనీలు సైతం ఈ ప్రదర్శనలో పాలుపంచుకున్నాయి. 2014లో రెండు వేల కోట్ల రూపాయలుగా ఉన్న భారత రక్షణ రంగ ఎగుమతులు- 2018-19 నాటికి రూ.10,745 కోట్లకు చేరాయి. వచ్చే అయిదేళ్లలో భారత రక్షణ రంగ ఉత్పత్తుల ఎగుమతులను రూ.35వేల కోట్లకు చేర్చాలని ప్రధాని మోదీ లక్ష్య నిర్దేశం చేశారు.

ఎగుమతులు విస్తరించని పక్షంలో రక్షణ బడ్జెట్‌ ఎంత పెరిగినా- దేశీయ అవసరాలు తీరే పరిస్థితి లేదు. కేవలం దిగుమతులతోనే ప్రస్తుత అవసరాలు తీర్చుకోవడమూ సాధ్యం కాదు. ప్రపంచవ్యాప్తంగా రక్షణ సామగ్రి దిగుమతుల్లో భారత్‌ రెండో స్థానంలో ఉంది. ఈ పరిస్థితి మారాలి. రక్షణ రంగ ఎగుమతులకు సాధారణ ఎగుమతులతో పోలిస్తే భిన్నమైనవి. పూర్తిగా అంతర్జాతీయ శక్తుల ఆంక్షల పరిధిలో ఈ ఎగుమతులు జరగాల్సి ఉంటుంది. భారత్‌ సైతం ‘వాసెనార్‌’, ‘ఎంటీసీఆర్‌’ వంటి పలు అంతర్జాతీయ ఒప్పందాల్లో భాగస్వామి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ఒప్పందాలను ఉల్లంఘించే పరికరాలు ఎగుమతి చేస్తే కోరి తలనొప్పులు తెచ్చుకొన్నట్లే! వీటికి రక్షణ శాఖ ఉత్పత్తుల విభాగం అనుమతులతోపాటు, పలు శాఖలు పచ్చజెండా ఊపాల్సి ఉంటుంది.

రక్షణ ఉత్పత్తులు విధానం

ఈ క్రమంలో కాలహరణను గణనీయంగా తగ్గించుకోవాల్సి ఉంటుంది. అందుకే రక్షణ ఉత్పత్తుల విధానం-2018ని తీసుకువచ్చారు. దీంతోపాటు భారత్‌కు వచ్చే ‘రీ-ఆర్డర్లు’ గతంలో ఎగుమతి చేసిన వాటి విడిభాగాల ‘ఆర్డర్ల’ను వీలైనంత తొందరగా పరిపూర్తి చేసేలా నిబంధనలను కొన్ని నెలల కిందటే ప్రభుత్వం సడలించింది. మరోపక్క నాణ్యతపైనా దృష్టిపెట్టాలి. లేనిపక్షంలో గతంలో ‘ఇన్సాస్‌ రైఫిల్స్‌’ ఎగుమతులకు సంబంధించి నేపాల్‌నుంచి వచ్చిన విమర్శల వంటివే ఎదుర్కోవాల్సి ఉంటుంది.

భారత్‌ ఇప్పటివరకు ప్రధానమైన జలాంతర్గాములు, భారీ యుద్ధ విమానాల వంటివి ఎగుమతి చేయడంలేదు. ప్రస్తుత ఎగుమతుల్లో చిన్న మధ్యశ్రేణి ఆయుధాలు, పరికరాలు, విడిభాగాలు, ఆత్మరక్షణ, సహాయ సాధనాలే అత్యధికంగా ఉంటున్నాయి. తేలికపాటి హెలికాప్టర్లు, పెట్రోలింగ్‌ నౌకలు, ఆర్మర్‌ ప్లేట్స్‌, స్లీపింగ్‌ బ్యాగ్స్‌, బులెట్‌ ప్రూఫ్‌ జాకెట్లు, పేలుడు నుంచి రక్షణ ఇచ్చే దుప్పట్లు, శిరస్త్రాణాలు వంటి వాటిని 42 దేశాలకు ఎగుమతి చేస్తోంది. ఒక్క అమెరికాకే అయిదువేల కోట్ల రూపాయల విలువైన పరికరాలను 2018-19లో భారత్‌ ఎగుమతి చేసింది. ఇటీవల రూ.350 కోట్ల విలువైన 50వేల బోఫోర్స్‌ శతఘ్నుల్లో ఉపయోగించే గుండ్లను యూఏఈకి ఎగుమతి చేసే ‘ఆర్డర్‌’ను ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ బోర్డు సాధించింది. భారత్‌ తయారు చేసిన తేజస్‌ యుద్ధవిమానంపట్ల- మలేసియా, కొలంబియా, ఇండొనేసియా, ఈజిప్ట్‌, శ్రీలంక వంటి దేశాలు ఆసక్తిగా ఉన్నాయి. కానీ, ఈ విభాగంలో చైనాకు చెందిన జె-17, దక్షిణ కొరియాకు చెందిన గోల్డెన్‌ ఈగిల్‌, రష్యాకు చెందిన యాక్‌-130 ప్రధాన పోటీదారులుగా ఉన్నాయి. అన్నీ సానుకూలంగా జరిగి భారత్‌కు యుద్ధవిమాన విపణి ద్వారాలు తెరుచుకుంటే- రక్షణ రంగ ఎగుమతుల్లో పురోగతి ఖాయం.

ఇక భారత్‌కు చెందిన బ్రహ్మోస్‌ క్షిపణులకు రష్యాలో తయారైన పీ-800 ఆనిక్‌ క్షిపణులు విపరీతమైన పోటీ ఇస్తున్నాయి. వాటికి బ్రహ్మోస్‌ స్థాయి సామర్థ్యం లేకపోయినా- ధర విషయంలో రాజీపడి చిన్న దేశాలు ఆ వైపు మొగ్గుచూపుతున్నాయి. కానీ, ఇప్పుడు రష్యాపై అమెరికా ఆంక్షలు విధించడంతో పరిస్థితి భారత్‌కు కొంత అనుకూలంగా మారింది. ధనుష్‌ శతఘ్నులు వంటివి అంతర్జాతీయ విపణిలోకి వస్తే భారత్‌ స్థానం మరింత బలపడే అవకాశం ఉంది. దీంతోపాటు అభివృద్ధి చెందిన దేశాల ఆయుధాల ధరలతో పోలిస్తే భారత్‌ ఆయుధాల ధర కొంత తక్కువగా ఉంటుంది. దీంతోపాటు విదేశాల్లో మన రాయబార కార్యాలయాలకు అనుసంధానంగా పనిచేస్తున్న భారత ప్రతినిధులను సైతం ఆయుధ విక్రయాల్లో భాగస్వాములను చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆయుధ ఉత్పత్తుల ప్రచారానికి భారత్‌ చెప్పుకోదగిన స్థాయిలో నిధులు కేటాయించింది. తాజాగా మరో 10 దేశాల్లో రక్షణ ప్రతినిధులను నియమించాలనీ నిర్ణయించింది.

ఆఫ్రికాతో ఊపందుకోనున్న వాణిజ్యం

ఈ ప్రదర్శనలో తొలిసారి భారత్‌, ఆఫ్రికా దేశాల రక్షణ మంత్రుల సమావేశం నిర్వహించారు. దీనిలో మొత్తం 50 దేశాల ప్రతినిధులు పాల్గొని రక్షణ సహకారానికి సంబంధించిన ‘లఖ్‌నవూ తీర్మానం’పై సంతకాలు చేశారు. ఉగ్రవాదంపై పోరాటం, సముద్ర జలాల్లో నిఘా, సహకారం శిక్షణ వంటి అంశాల్లో ఇరుపక్షాలు పరస్పరం చేదోడు వాదోడుగా ఉండాలని నిర్ణయించాయి. వాస్తవానికి 54 దేశాలు ఉన్న ఆఫ్రికాతో బలమైన బంధం భారత్‌కు చాలా ముఖ్యం. ‘సమితి’ వంటి ప్రపంచ వేదికలపై వీటి మద్దతు భారత్‌కు ఎంతో ఉపయోగపడుతుంది. 2018-19 నాటికి ఇరుపక్షాల మధ్య వాణిజ్యం ఆరువేల బిలియన్‌ డాలర్లు దాటింది. 33 దేశాల ఉత్పత్తులకు భారత్‌ మార్కెట్లను తెరిచింది.

కానీ, ఈ మొత్తంలో భారత్‌కు లభించేది చాలా తక్కువ, ఆఫ్రికాకు కలిగే లబ్ధి ఎక్కువ. టాంజానియా, నైజీరియా, ఇథియోపియా వంటి దేశాల్లో డిఫెన్స్‌ అకాడమీల ఏర్పాటుతోపాటు- ఉగాండా, బోట్సువాన, నమీబియా తదితర దేశాలకు శిక్షణ బృందాలనూ భారత్‌ పంపుతోంది. దాంతోపాటు విదేశాల్లో ‘ఆపరేషన్‌ వెనీలా’ వంటి సహాయ కార్యక్రమాలనూ భారత్‌ చేపడుతోంది. వివిధ దేశాల్లో భారత్‌ చేస్తున్న సాయానికి వాణిజ్య కోణాన్ని జోడించాల్సిన అవసరం ఉంది. గడచిన జులై నాటికి 40కి పైగా దేశాలకు 1,100 కోట్ల డాలర్ల విలువైన 191 రుణ స్వీకరణ సదుపాయాన్ని (లైన్‌ ఆఫ్‌ క్రెడిట్‌) భారత్‌ కల్పించింది. ఈ సదుపాయాన్ని రక్షణ ఉత్పత్తుల కొనుగోళ్లకూ విస్తరించాల్సిన అవసరం ఉంది. అప్పుడే రక్షణ ఎగుమతులను రూ.35వేల కోట్లకు చేర్చాలన్న లక్ష్యం సాకారమవుతుంది.

ఇదీ చూడండి: దేశవ్యాప్త విస్తరణ దిశగా 'ఆప్'-త్వరలో ప్రచార కార్యక్రమం

Last Updated : Mar 1, 2020, 9:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.