ETV Bharat / bharat

గాడిద పాలతో తయారైన సౌందర్య ఉత్పత్తులు చూశారా! - కేరళలో గాడిద పాలతో సౌందర్య ఉత్పత్తులు

కేరళకు చెందిన అబీ బేబీ అనే యువకుడు గాడిద పాలతో సౌందర్య ఉత్పత్తులు రూపొందించి వ్యాపార రంగంలో రాణిస్తున్నాడు. వినూత్నమైన ఆలోచనలతో ముందుకెళ్తున్న బేబీ కృషిని గుర్తించిన భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ ఈ ఏడాది ఆయనకు 'ఇన్నోవేటివ్ ఫార్మర్' అవార్డునూ అందించింది.

గాడిద పాలతో తయారైన సౌందర్య ఉత్పత్తులు చూశారా!
author img

By

Published : Nov 3, 2019, 1:20 PM IST

గాడిద పాలతో తయారైన సౌందర్య ఉత్పత్తులు చూశారా!

మంచి ఆదాయాన్ని ఇస్తున్న ఉద్యోగాన్ని వదులుకొని ఓ ఐటీ నిపుణుడు సరికొత్త ఆలోచనలతో వ్యాపార రంగంలోకి దూకాడు. గాడిద పాలతో సౌందర్య ఉత్పత్తులు తయారుచేస్తూ వ్యాపారంలో సరికొత్త ఒరవడిని సృష్టించి చక్కని విజయాన్ని సాధించాడు. ఆయనే కేరళ ఎర్నాకుళంకు చెందిన ఐటీ నిపుణుడు అబీ బేబీ.

సరికొత్త ఒరవడితో..

బేబీ బెంగళూరులోని ఓ ఐటీ సంస్థలో ఉద్యోగం చేస్తుండేవాడు. వ్యాపార రంగంలోకి రావాలనే కోరికతో ఉద్యోగాన్ని వదులుకున్నారు. అందరికంటే భిన్నంగా ఉండాలనే ఆలోచనతో ఎర్నాకుళం జిల్లాలోని రామమంగళంలో తన సొంత పొలంలో మూడు సంవత్సరాల క్రితం 21 గాడిదలతో 'డాల్ఫిన్​ ఐబీఏ' ఫాంను ఏర్పాటుచేశారు. ఇందులో పొయిటౌ రకానికి చెందిన ఆరు ఫ్రెంచ్​ గాడిదలు, ఓ గుజరాతీ హిల్లరీ గాడిద ఉన్నాయి.

ఎన్​ఆర్​సీసీలో శిక్షణ

అబీ బేబీ రాజస్థాన్ బికనీర్​లోని ఎన్​ఆర్​సీసీలో నిపుణుల వద్ద శిక్షణ తీసుకున్నారు. గాడిద పాలతో ఫెయిర్​నెస్ క్రీమ్​, ఫేషియల్ కిట్​, స్కిన్​ క్రీమ్​, హెయిర్​ జెల్​లను తయారుచేసి, ఆ ఉత్పత్తులను డాల్ఫిన్ ఐబీఏ ఆన్​లైన్ వేదిక ద్వారా విక్రయించడం మొదలుపెట్టారు.

"మేము ఫ్రీజ్ లైన్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నాం. ఈ పాలతో చేసిన ఉత్పత్తుల ద్వారా ట్రైస్​ ఎలిమెంట్స్​, విటమిన్లు, మినరల్స్ అందిస్తున్నాం. ఆరోగ్యవంతమైన చర్మ సౌందర్యం కోసం లేపనాలుగా క్రీమ్​లను అందిస్తున్నాం. అలాగే లోనికి తీసుకోవడానికి గాడిద పాలతో ఆహార పదార్థాలనూ అందిస్తున్నాం." - అబీ బేబీ, డాల్ఫిన్​ ఐబీఏ ఫాం వ్యవస్థాపకుడు

విజయం సాధించారు..

భారత్​లో గాడిదలంటే చిన్న చూపు ఉండడం మూలాన మొదట్లో అందరూ.. బేబీని ఎగతాళి చేసేవారు. అయితే వాటిని ఏనాడూ పట్టించుకోని బేబీ. గాడిద పాలతో సౌందర్య ఉత్పత్తులు తయారుచేయవచ్చని నిరూపించాడు. ఫలితంగా ఆయన తయారుచేసిన సౌందర్య ఉత్పత్తులకు డిమాండ్​ పెరిగి... ప్రపంచ స్థాయిలో విజయం సాధించాయి. అబీ బేబీ కృషిని గుర్తించిన భారతీయ వ్వయసాయ పరిశోధన సంస్థ ఈ ఏడాది ఆయనకు ఇన్నోవేటివ్ ఫార్మర్ అవార్డును అందించింది.

అమెరికా, యూరప్​ల నుంచి..

బేబీ ఫాంలో తయారుచేసిన సౌందర్య ఉత్పత్తులకు అమెరికా, యూరప్ దేశాల నుంచి ఆర్డర్లు వస్తున్నాయని అబీ బేబీ చెబుతున్నారు. ఇప్పుడు గాడిద పాలతో సబ్బులు, లిప్​ బామ్​లనూ ఉత్పత్తి చేయాలని బేబీ యోచిస్తున్నారు.

ఇదీ చూడండి: అక్టోబర్​లో రికార్డు స్థాయికి.. యూపీఐ లావాదేవీలు

AP Video Delivery Log - 0000 GMT News
Sunday, 3 November, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2346: US Trump AP Clients Only 4237936
Trump heads to NY, blasts Pelosi & impeachment probe
AP-APTN-2315: Brazil Zombie Walk AP Clients Only 4237935
Rio Day of the Dead zombie walk draws hundreds
AP-APTN-2230: UK Bonfire Bercow AP Clients Only 4237934
Effigy of ex UK House Speaker burned on bonfire
AP-APTN-2227: Japan Rugby Prince Harry AP Clients Only 4237933
Prince Harry congratulates SAfrica on World Cup win
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.