దేశంలో కొవిడ్ విలయ తాండవం కొనసాగుతోంది. తాజాగా 61 వేల 537 కొత్త కేసులు నమోదయ్యాయి. మహమ్మారి ధాటికి మరో 933 మంది చనిపోయారు. ఫలితంగా మొత్తం మరణాల సంఖ్య 42 వేల 518కి చేరింది.
రికవరీ రేటు..
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం.. దేశంలో కరోనా రికవరీ రేటు 68.32 శాతంగా ఉంది. మరణాల రేటు కాస్త ఊరట కలిగిస్తూ.. 2.04 శాతంగా నమోదైంది.
ఇదీ చదవండి: 'కరోనా టీకా.. మాకే ముందుగా'- పంపిణీ సవాలే!