ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు అతిపెద్ద లాక్డౌన్ ప్రకటించింది భారత ప్రభుత్వం. 130 కోట్ల మంది ప్రజలను ఇళ్లల్లోనే ఉండాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రజలు ఎవరు బయటకు రాకుండా చూసేలా పోలీసులు పహారా కాస్తున్నారు.
అయినప్పటికీ ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ కొంతమంది కారణం లేకుండానే వీధుల్లోకి వస్తున్నారు. వీరిని అడ్డుకునేందుకు పోలీసులు వినూత్నంగా శిక్షిస్తున్నారు. రోడ్లపైకి వచ్చినవారిని హెచ్చరిస్తూ ఇంట్లో ఉండాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తున్నారు.
-
When you have to travel in a #milk tanker ! #Lockdown21 pic.twitter.com/xJiFTuzRPM
— Ramandeep Singh Mann (@ramanmann1974) March 25, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">When you have to travel in a #milk tanker ! #Lockdown21 pic.twitter.com/xJiFTuzRPM
— Ramandeep Singh Mann (@ramanmann1974) March 25, 2020When you have to travel in a #milk tanker ! #Lockdown21 pic.twitter.com/xJiFTuzRPM
— Ramandeep Singh Mann (@ramanmann1974) March 25, 2020
దిల్లీలో భారీగా కేసులు..
లాక్డౌన్ నేపథ్యంలో రోడ్లపైకి వచ్చినవారిపై దిల్లీలో ఐపీసీ సెక్షన్ 188 కింద 482 కేసులు నమోదయ్యాయి. 10,249 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. 1,964 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
ప్రజల సమస్యలు తెలుసుకోవటం, లాక్‌డౌన్‌పై ఉన్న సందేహాలను నివృతి చేయటం కోసం 24 గంటల హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసింది దిల్లీ పోలీసు విభాగం.
ట్విట్టర్లో హెచ్చరికలు..
ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు విభాగం ఓ 14 సెకన్ల వీడియోను పోస్టు చేసింది. వీధుల్లోకి వచ్చినవారితో గుంజీలు తీయిస్తూ మిగతా వారికి హెచ్చరికలు జారీ చేసింది. మహారాష్ట్ర పోలీసులు కూడా ఇలాంటి వీడియోనే పోస్ట్ చేశారు. కర్ణాటక కలబురగిలో వీధుల్లోకి వచ్చిన వారిని పోలీసులు ఇలాగే శిక్షించారు.
-
A picture that speaks volumes. 🙂 #Lockdown21
— Vikrant Jhala (@vikrantjhala) March 25, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Please stay indoors. 🙏
Image source: #LinkedIn Feed#StopTheSpreadOfCorona #AhmedabadFightsCorona #Ahmedabad pic.twitter.com/IwMQpkNvvB
">A picture that speaks volumes. 🙂 #Lockdown21
— Vikrant Jhala (@vikrantjhala) March 25, 2020
Please stay indoors. 🙏
Image source: #LinkedIn Feed#StopTheSpreadOfCorona #AhmedabadFightsCorona #Ahmedabad pic.twitter.com/IwMQpkNvvBA picture that speaks volumes. 🙂 #Lockdown21
— Vikrant Jhala (@vikrantjhala) March 25, 2020
Please stay indoors. 🙏
Image source: #LinkedIn Feed#StopTheSpreadOfCorona #AhmedabadFightsCorona #Ahmedabad pic.twitter.com/IwMQpkNvvB
పంజాబ్ పోలీస్..
ఇదే తరహాలో పంజాబ్‌లోని బట్లాలో ఓ పోలీసు అధికారి వీధుల్లో తిరుగుతూ ఎక్కడికక్కడ ప్రజలను నిలువరిస్తున్నారు. బయటికి వచ్చినందుకు క్షమాపణలు చెప్పిస్తున్నారు. గుంజీలు తీయిస్తున్నారు. రహదారిపై పడుకోబెట్టి ఇంకోసారి ఇలా చేయమని చెప్పిస్తున్నారు. షాపుల్లో ఎక్కువమంది ఉండకుండా చూడాలని దుకాణాదారులను హెచ్చరిస్తున్నారు.
లాఠీ ఛార్జ్..
తెలంగాణ, రాజస్థాన్, ఏపీ గుంటూరులో పోలీసులు లాఠీలకూ పనిచెప్పారు. అత్యవసరాల కోసం వచ్చినా పోలీసులు వేధిస్తున్నారని కొంతమంది ట్విట్టర్లో పోస్టులు చేస్తున్నారు.
తెలంగాణలో ఓ వైద్యురాలిని ఐడీ కార్డు చూపించిన తర్వాత కూడా అడ్డుకోవటం వల్ల పోలీసుల తీరుపై విమర్శలు వస్తున్నాయి. బంగాల్ రాజధాని కోల్‌కతాలో తమ వాహనాన్ని ఆపినందుకు ఓ మహిళ.. పోలీసు అధికారిపై దాడి చేసింది. అధికారి చేతిని కొరికిందని ఆమెతో పాటు ఆ వాహనంలో ఉన్న మరో ఇద్దరిపై కేసు నమోదు చేశారు.
-
WTF this DESPICABLE Woke #COVIDIOT when stopped by police abused & spit on Kolkata Police Cop 😠😡 #COVIDIDIOTS #COVIDIOTS #coronavirusindia #21daylockdown pic.twitter.com/Q1P8RcVtZw
— Rosy (@rose_k01) March 25, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">WTF this DESPICABLE Woke #COVIDIOT when stopped by police abused & spit on Kolkata Police Cop 😠😡 #COVIDIDIOTS #COVIDIOTS #coronavirusindia #21daylockdown pic.twitter.com/Q1P8RcVtZw
— Rosy (@rose_k01) March 25, 2020WTF this DESPICABLE Woke #COVIDIOT when stopped by police abused & spit on Kolkata Police Cop 😠😡 #COVIDIDIOTS #COVIDIOTS #coronavirusindia #21daylockdown pic.twitter.com/Q1P8RcVtZw
— Rosy (@rose_k01) March 25, 2020
ఇదీ చూడండి: కరోనా పంజా: భారత్‌లో 600 దాటిన కేసులు