ETV Bharat / bharat

'కరోనా వైరస్​ కన్నా భయమే అతి పెద్ద సమస్య' - 'కరోనా వైరస్​ కన్నా భయమే అతి పెద్ద సమస్య'

లాక్​డౌన్​ నేపథ్యంలో వలస కూలీల పరిస్థితిపై దాఖలైన వ్యాజ్యాలపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. కూలీల వలసలు ఆపేందుకు ఏం చర్యలు చేపట్టారో నివేదించాలని కేంద్రాన్ని ఆదేశించింది. కరోనా వైరస్​కన్నా ఆ మహమ్మారి గురించి భయాలు పెరగడమే అతిపెద్ద సమస్యని ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది సుప్రీంకోర్టు.

Coronavirus: SC seeks status report from Centre on steps taken to prevent migration of workers
'కరోనా వైరస్​ కన్నా భయమే అతి పెద్ద సమస్య'
author img

By

Published : Mar 30, 2020, 4:14 PM IST

కరోనా వైరస్​ కన్నా ఆ మహమ్మారిపై అంతకంతకూ పెరుగుతున్న భయాలే అతిపెద్ద సమస్యగా మారుతోందని అభిప్రాయపడింది సుప్రీంకోర్టు. లాక్​డౌన్​ నేపథ్యంలో కూలీల వలసలకు సంబంధించి దాఖలైన పిటిషన్​పై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. కూలీల వలసలు ఆపేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని కేంద్రాన్ని ఆదేశించింది.

2 వ్యాజ్యాలపై వాదనలు

లాక్​డౌన్​ నేపథ్యంలో నగరాలు వదిలి స్వస్థలాలకు పయనమైన వలస కూలీలకు వసతి, ఆహారం అందించాలని కోరుతూ 2 వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ బోబ్డే, జస్టిస్​ ఎల్​ నాగేశ్వర రావుతో కూడిన ధర్మాసనం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాదనలు ఆలకించింది.

వలస కూలీల సంక్షేమం కోసం చేపట్టాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు పిటిషనర్లు. అయితే... ఇప్పటికే అవసరమైన చర్యలన్నీ చేపట్టినట్లు నివేదించారు కేంద్రం తరఫు న్యాయవాది, సొలిసిటర్​ జనరల్​ తుషార్ మెహతా. ఈ వ్యవహారంపై స్థితి నివేదిక సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశించింది సుప్రీంకోర్టు. విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.

పీఎం కేర్స్​కు విరాళం....

కరోనా వైరస్​ నియంత్రణకు విరాళాల కోసం ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించిన పీఎం కేర్స్​ నిధికి సుప్రీంకోర్టు సిబ్బంది తమ మూడు రోజుల వేతనాన్ని విరాళంగా ప్రకటించారు.. గెజిటెడ్​ ఉద్యోగులు మూడు రోజుల వేతానాన్ని, నాన్​ గెజిటెడ్​ ఉద్యోగులు రెండు రోజుల జీతాన్ని, గ్రూప్​ సీ ఉద్యోగులు ఒక రోజు వేతనాన్ని విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు సుప్రీం కోర్టు అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి:కరోనా సూట్​లో మంత్రి వినూత్న ప్రచారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.