భారత్‌లో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో తాజాగా 14,361 మందికి వైరస్ సోకగా... 331 మంది మృతి చెందారు. 5,43,170 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు.
కర్ణాటకలో శుక్రవారం 8,960 కరోనా కేసులు నమోదవగా... 136 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 3,18,752కు చేరింది.
ఉత్తర్‌ప్రదేశ్‌లో ఒక్కరోజే 5,447 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. మరో 77 మంది ప్రాణాలు కోల్పోయారు.
- కేరళలో కొత్తగా 2,543 మంది వైరస్ బారిన పడ్డారు.
- దిల్లీలో మరో 1,808 కేసులు బయటపడ్డాయి. 20 మంది చనిపోయారు. మొత్తం కేసులు లక్షా 70వేలకు చేరువలో ఉన్నాయి.
ఇదీ చూడండి: పార్లమెంటుకు వచ్చే ఎంపీలకు కరోనా టెస్టులు!