దేశవ్యాప్తంగా మే 31 వరకు లాక్‌డౌన్‌ను పొడిగించింది కేంద్రం. ఈ మేరకు జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ(ఎన్డీఎంఏ) ఉత్తర్వులు జారీ చేసింది.
ఇటీవలే జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించినప్పుడు లాక్‌డౌన్‌ను పొడిగిస్తామని ప్రకటన చేశారు. అయితే నాలుగో విడత లాక్‌డౌన్‌లో గ్రీన్, ఆరెంజ్ జోన్లలో మరిన్ని సడలింపులకు కేంద్రం కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది.
కరోనా కేసులు అదుపులోకి రాకపోవడం వల్ల పంజాబ్, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను మే 31 వరకు పొడిగిస్తూ ఇప్పటికే ప్రకటించాయి.
సమావేశం...
రాష్టాల్లో పరిస్థితులను తెలుసుకునేందుకు.. ఈరోజు రాత్రి 9 గంటలకు అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో సమావేశం కానున్నారు కేంద్ర కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు అంశాలపై చర్చించనున్నారు.
కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం... భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఇప్పటికే 90,927కు చేరింది. మహమ్మారికి 2,872 బలవగా..34,109 మంది కోలుకున్నారు.
ఇదీ చదవండి: భారత్‌పై కరోనా పంజా.. 91వేలకు చేరువలో కేసులు