కరోనా వైరస్ నేపథ్యంలో 647 మంది భారతీయులను చైనా వుహన్ నుంచి రెండు ప్రత్యేక విమానాల ద్వారా తీసుకొచ్చిన ఎయిర్ ఇండియా సిబ్బందిని ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసించారు. మొత్తం 68 మందికి మోదీ సంతకం చేసిన ప్రశంసాపత్రాలను విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అందజేశారు.
"ఈ సమావేశం ఎంతో ప్రత్యేకం. వృత్తి పట్ల మీకున్న గౌరవానికి ఇది ప్రతీక. వాణిజ్య అంశాలకు ఎంతో ప్రాధాన్యం ఉన్నప్పటికీ దేశంపై ఎయిర్ ఇండియా అంకితభావం కలిగి ఉంది. ఇది ఓ ఉన్నత సంస్థ. ప్రస్తుతం ఎయిర్ ఇండియా 42 అంతర్జాతీయ, 82 దేశీయ గమ్యస్థానాలకు తన సేవలను అందిస్తుంది."
- హర్దీప్ సింగ్ పూరి, విమానయాన మంత్రి.
ప్రధాని ప్రశంసాపత్రాలపై ఎయిర్ ఇండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ హర్షం వ్యక్తం చేశారు.
జనవరి 31న వుహాన్ నుంచి 347 మంది భారతీయులను ఎయిర్ ఇండియాకు చెందిన బీ-747 ప్రత్యేక విమానం ద్వారా భారత్కు తీసుకొచ్చారు. మరుసటి రోజు ఇదే విమానంలో మాల్దీవులకు చెందిన ఏడుగురు వ్యక్తులతో పాటు, భారత్కు చెందిన మరో 323 మందిని స్వదేశానికి చేర్చారు.
ఇదీ చూడండి: ఆప్: 'ఇదే సరైన తరుణం.. జాతీయ పార్టీగా ఎదుగుదాం'