ETV Bharat / bharat

విదేశాల్లోని భారతీయుల కోసం కేంద్రం 'మెగాప్లాన్​'

కరోనా నేపథ్యంలో అన్నిరంగాలు మూతపడటం వల్ల.. ఎక్కడివారు అక్కడే చిక్కుకుపోయారు. ఇలా విదేశాల్లో ఉన్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది కేంద్రం. దేశంలో లాక్‌డౌన్‌ ముగియగానే వారందరినీ రప్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

author img

By

Published : Apr 29, 2020, 8:54 PM IST

Coronavirus: India readies mega plan to bring back its nationals stranded abroad
క్‌డౌన్‌ ముగియగానే స్వదేశానికి భారతీయులు

కరోనా కారణంగా విధించిన ఆంక్షలతో.. విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించే చర్యలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. దేశంలో లాక్‌డౌన్‌ ముగిసిన వెంటనే భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు వీలుగా భారీ ప్రణాళికను సిద్ధం చేస్తోంది. ఇందుకోసం నౌకాదళ ఓడలు, సైనిక, వాణిజ్య విమానాలను వినియోగించుకోవాలని భావిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ అధికార వర్గాలు తెలిపాయి.

ఈ ప్రణాళికను సిద్ధం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం కోర్‌ కమిటీకి.. తమ వద్ద ఉన్న 650 విమానాల్లో అధిక భాగం సమకూర్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు పౌర విమానయాన శాఖ సమాచారం ఇచ్చింది. భారతీయులను స్వదేశానికి తీసుకువస్తే వారి కోసం తగిన ఏర్పాట్లు చేయాలని కేంద్రం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది.

'ఆపరేషన్‌ రాహత్‌' తర్వాత ఇదే..

2015లో యెమెన్‌లో అంతర్యుద్ధ సమయంలో భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు చేపట్టిన 'ఆపరేషన్ రాహత్‌' తర్వాత ఇదే అతిపెద్ద తరలింపు కార్యక్రమంగా భావిస్తున్నారు. ఈ ఆపరేషన్‌ కోసం తమ స్థావరాలను సిద్ధంగా ఉంచాలని కేంద్ర ప్రభుత్వం.. భారత నౌక, వైమానిక దళాలకు సూచించింది. ఈ ఆపరేషన్‌ కోసం నౌకాదళం వెయ్యి మందిని తరలించే సామర్థ్యం గల ఐఎన్‌ఎస్‌ జలాశ్వ నౌకను గుర్తించింది.

ఇదీ చదవండి: ఆఫీస్‌కు రావాలంటే 'ఆరోగ్యసేతు' ఉండాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.