భారత్‌లో కరోనా విజృంభిస్తోంది. ఒక్కరోజులో 47మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 1336మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది.

మహారాష్ట్రలో వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంది. అక్కడ ఇప్పటివరకు 4666 మందికి వైరస్ సోకింది. 232 మంది ప్రాణాలు కోల్పోయారు. దిల్లీలో 2,081మంది వైరస్ బాధితులు ఉన్నారు. గుజరాత్లో 1,939 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.
కర్ణాటకలో..
కర్ణాటక కలబురిగిలో 80 ఏళ్ల వృద్ధుడు వైరస్‌తో ప్రాణాలు కోల్పోయాడు. రాష్ట్రంలో మృతుల సంఖ్య 17కు చేరింది. కరోనా బాధితుల సంఖ్య 408గా ఉంది.
ఒడిశాలో..
ఒడిశాలో మరో ఐదుగురికి కరోనా సోకినట్లు నిర్ధరణ అయింది. దీంతో రాష్ట్రంలో బాధితుల సంఖ్య 79కి చేరింది. 53మందిలో కరోనా యాక్టివ్‌గా ఉంది. మరో 25మందికి వ్యాధి లక్షణాలు నయమయ్యాయి.
ఇదీ చూడండి: కరోనా నిర్ధరణకు సత్వర పరీక్షల సత్తువెంత?