ETV Bharat / bharat

దేశంలో మరొకరికి కరోనా.. 62కు చేరిన బాధితులు - కరోనా

కరోనా మన దేశంలోనూ విజృంభిస్తోంది. రాజస్థాన్​ జైపుర్​లో ఓ 85 ఏళ్ల వృద్ధుడికి వైరస్​ ఉన్నట్లు నిర్ధరణ అయింది. దీంతో కేసుల సంఖ్య 62కు చేరింది. కేరళలో అత్యధికంగా 17 మంది బాధితులున్నారు.

.Coronavirus: 85-yr-old man tests positive in Jaipur
దేశంలో మరొకరికి కరోనా
author img

By

Published : Mar 11, 2020, 11:38 AM IST

దేశంలో కరోనా కేసుల సంఖ్య 62కు చేరింది. రాజస్థాన్‌ జైపుర్‌కు చెందిన ఓ 85 ఏళ్ల వృద్ధుడికి కరోనా ఉన్నట్లు నిర్ధరణ అయింది. ఫిబ్రవరి 28న దుబాయ్​ నుంచి భారత్‌ తిరిగి వచ్చిన అతను కొన్ని రోజులుగా కరోనా లక్షణాలతో బాధపడుతున్నాడు.

ఎస్​ఎంఎస్​ ఆస్పత్రిలో సోమవారం చేరిన వృద్ధుడికి వైద్యపరీక్షల్లో కరోనా వైరస్‌ ఉన్నట్లు తేలింది. దీంతో అప్రమత్తమైన అధికారులు అతడితో సన్నిహితంగా ఉన్న 235 మందిని ఐసోలేషన్‌ వార్డులకు తరలించారు. అలాగే అతడు ప్రయాణించిన స్పైస్‌జెట్ విమానయాన సంస్థకు సమాచారం అందించినట్లు తెలిపారు.

గత వారం కరోనా సోకి ఇదే ఎస్​ఎంఎస్​ ఆస్పత్రిలో చేరిన ఇటలీ దంపతుల పరిస్థితి కాస్త మెరుగుపడిందని పేర్కొన్నారు వైద్యులు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.