కరోనా ప్రభావిత దేశం ఇటలీ నుంచి 263మంది భారతీయ విద్యార్థులను వెనక్కి తీసుకువచ్చారు. వీరిని దిల్లీలోని ఐటీబీపీ ప్రత్యేక శిబిరానికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.
"ఇటలీ నుంచి నేటి ఉదయం 10 గంటలకు ప్రత్యేక విమానం భారత్‌కు చేరుకుంది. ఈ విమానంలో వచ్చిన 263మంది విద్యార్థులను ప్రత్యేక శిబిరానికి తరలించాం."
-ఐటీబీపీ అధికారులు
కీలకంగా ఐటీబీపీ శిబిరం..
వైరస్ సేవల్లో దిల్లీ ఐటీబీపీ శిబిరం కీలకంగా పనిచేస్తోంది. మార్చి 15న ఇటలీ నుంచి వచ్చిన 215మంది భారతీయులు ఇప్పటికే ఐటీబీపీ శిబిరంలో వైద్య పరిశీలనలో ఉన్నారు. ఇంతకుముందు చైనా వుహాన్ నుంచి వచ్చిన రెండు బృందాలకు కూడా ఈ శిబిరంలోనే వైద్య పరిశీలనలో ఉంచి నెగటివ్‌గా తేలినవారిని ఇంటికి పంపించారు.
ఇదీ చూడండి: దేశంలో కరోనాకు మరొకరు బలి- మొత్తం 324 పాజిటివ్ కేసులు