411మందికి కరోనా
మధ్యప్రదేశ్‌లో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 33 మరణాలతో సహా, 411మందికి వైరస్ సోకింది. ఇండోర్‌లో అత్యధికంగా 221 కేసులు నమోదయ్యాయి. భోపాల్‌లో 98 మంది మహమ్మారి బారిన పడ్డారు.
21:57 April 09

21:35 April 09
ఒక్కరోజులో 80 మందికి
రాజస్థాన్‌లో గురువారం ఒక్కరోజు వ్యవధిలో 80 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధరణ అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 463 మందికి వైరస్ సోకింది.
20:58 April 09
169కి పెరిగింది...
దేశంలో కరోనా మృతుల సంఖ్య 169కి చేరింది. కేసుల సంఖ్య 5865కు పెరిగినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.
20:30 April 09
గుజరాత్లో 76 కేసులు:
గుజరాత్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 76 కరోనా పాజిటివ్ కేసులు, ఒక మరణం నమోదైంది. మొత్తం బాధితుల సంఖ్య 262 కాగా... మరణాల సంఖ్య 17కు చేరింది.
20:26 April 09
స్కూల్లే వారికి ఆవాసాలు
మహారాష్ట్రలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో స్కూళ్లలో ప్రజలు ఉండేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
" ముంబయిలోని చాలా ప్రాంతాల్లో చిన్న గదుల్లోనే దాదాపు 15 మంది వరకు నివాసం ఉంటారు. ప్రస్తుతం భౌతిక దూరం అవసరమున్న నేపథ్యంలో ప్రజలు స్కూళ్లలో ఉండేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం" అని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి, రాజేశ్ తోపే వెల్లడించారు. అంతేకాకుండా పలు ప్రాంతాల్లోని సులభ్ కాంప్లెక్స్‌లు, మూత్రశాలలను శుభ్రం చేసేందుకు అగ్నిమాపక యంత్రాలను వినియోగించనున్నట్లు తెలిపారు.
20:17 April 09
'కరోనా' కిట్‌లో ఉండే వస్తువులివే..
లాక్డౌన్ నేపథ్యంలో రేషన్‌కార్డు కలిగిన ప్రతి కుటుంబానికీ 17 రకాల సరకులతో ఆహార కిట్ల పంపిణీకి శ్రీకారం చుట్టింది కేరళ ప్రభుత్వం. గురువారం నుంచే వీటి పంపిణీని ప్రభుత్వం ప్రారంభించింది. మొత్తం రూ. వెయ్యి విలువ చేసే వస్తువులను ఈ కిట్లలో అందిస్తున్నారు. కిలో పంచదార, 250 గ్రాముల టీ పొడి, కిలో ఉప్పు, సెనగలు, అర లీటర్ వంట నూనె, రెండు కిలోల గోధుమ పిండి, కిలో రవ్వ, సబ్బులు మొదలైన 17 వస్తువులతో ఈ కిట్లను సిద్ధం చేశారు.
20:13 April 09
కరోనాపై పోరుకు అలోపతి, ఆయుర్వేదం
కొవిడ్ - 19 బాధితులకు వైద్యం అందించడానికి అలోపతి, ఆయుర్వేదాన్ని వినియోగించనున్నట్లు గోవా ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ వివరాలు వెల్లడించారు.ఈ రాష్ట్రంలో ఇప్పటివరకు ఏడు కరోనా కేసులు నమోదయ్యాయి.
20:05 April 09
దేశవ్యాప్తంగా లాక్డౌన్ నేపథ్యంలో కర్ణాటక విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 27 నుంచి మే 9 వరకు జరగాల్సిన పదో తరగతి పరీక్షలను వాయిదా వేసింది. రాష్ట్రంలో పరిస్థితులు చక్కబడిన అనంతరం కొత్త తేదీలు ప్రకటిస్తామని స్పష్టం చేసింది. పరీక్షలు మొదలయ్యే 10 రోజుల ముందు మాత్రం విద్యార్థులకు పునశ్చరణ క్లాసులు పెట్టనున్నట్లు తెలిపింది.
19:37 April 09
కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా నేపాల్ ప్రభుత్వం మార్చి 24 నుంచి లాక్డౌన్ ప్రకటించింది. ఇది ఏప్రిల్ 15 వరకు కొనసాగనుంది. ఈ నేపథ్యంలో తాజాగా రెండు రోజులు లాక్డౌన్ సడలిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సమయంలో ప్రతీ ఒక్కరూ ఎవరి స్వస్థలాలకు వాళ్లు చేరుకోవాలని సూచించింది.
అత్యవసరంగా లాక్డౌన్ ప్రకటించడం వల్ల నేపాల్ రాజధాని ఖాట్మండులో... వివిధ ప్రాంతాల ప్రజలు నిర్బంధంలో ఉండిపోయారు. వారి కోసం రెండు రోజులు రాకపోకలకు అనుమతి ఇస్తున్నట్లు ఆ దేశ ప్రభుత్వం తెలిపింది.
19:28 April 09
మహారాష్ట్రలో కోలుకున్న 19 మంది:
మహారాష్ట్రలోని సంగ్లీ ప్రాంతానికి చెందిన కొంత మంది కరోనా నుంచి క్షేమంగా బయటపడ్డారు. ఇటీవలె 25 మందికి వైద్య పరీక్షల్లో పాజిటివ్ రాగా.. 14 మంది కోలుకున్నారు. మరో 11 మంది పరిస్థితి సాధారణంగా ఉన్నట్లు ఆ రాష్ట్ర వైద్యశాఖ వెల్లడించింది.
19:10 April 09
మాస్కుల వాడకంపై ఎయిమ్స్ సూచనలు:
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వైద్యులు మాస్కులు వాడటంపై కొన్ని సూచనలు చేసింది ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(ఎయిమ్స్). మాస్కుల కొరత కారణంగా వాటిని తిరిగి వాడాలంటూ వైద్య సిబ్బందిని కోరిన మరుసటి రోజే ఈ ప్రకటన చేసింది. ఒక్కో మాస్కును నాలుగు సార్లు వాడాలంటూ ఎయిమ్స్ గతంలో వారిని కోరింది. ఏ రోజు వాడిన మాస్కుకు ఆ రోజు నంబరు వేసి, ఒక బ్రౌన్ బ్యాగ్‌లో భద్రపరిచి, నాలుగు రోజుల తరవాత వాడాలని వాటిలో పేర్కొంది.
" మొదటి రోజు విధులకు వెళ్లేప్పుడు వాడిన మాస్కుకు ఒకటి అని సంఖ్య వేసి పేపర్ బ్యాగులో భద్రపర్చాలి. మిగతా రోజుల్లో మిగతా మాస్కులకు కూడా ఇలాగే నంబర్లు వేయాలి. వాటిని ఓ పేపర్ బ్యాగులో ఉంచి నాలుగు రోజుల పాటు బాగా ఆరనివ్వాలి. ఐదో రోజు మొదటి మాస్కును వాడాలి. అలా 20 రోజుల తరవాత ఇతర వైద్య వ్యర్థాల మాదిరిగానే వాడిన మాస్కును ఒక పేపర్ బ్యాగ్‌లో పెట్టి పడేయాలి" అని ఎయిమ్స్ వివరించింది. అట్లాంటాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సూచనలు ఇక్కడ ప్రస్తావించింది.
19:05 April 09
ఉగాండా అధ్యక్షుడికి మోదీ ఫోన్‌కాల్:
ఉగాండా అధ్యక్షుడు యొవెరి ముసెవెని, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్లో సంభాషించుకున్నారు. ఉగాండాలో కొవిడ్-19 మహమ్మారి వ్యాప్తిని నిరోధించడానికి భారత్ వీలైనంత సాయం చేస్తుందని ముసెవెనికి మోదీ హామీ ఇచ్చారు. కరోనా కారణంగా ఇరు దేశాల ఆరోగ్య, ఆర్థిక రంగాల్లో తలెత్తున్న సమస్యల గురించి.. వీరివురూ చర్చించారని ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది.
18:57 April 09
రాజస్థాన్‌లోనూ మాస్కు తప్పనిసరి
కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు రాజస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లోని ప్రజలంతా తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ఆదేశాలు జారీ చేసింది.
18:53 April 09
కోటిన్నర పీపీఈలకు కేంద్రం ఆర్డర్:
కరోనాపై పోరాటంలో భాగంగా రాష్ట్రాలను సమన్వయం చేస్తూ పనిచేస్తున్నామని కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. అన్ని ప్రభుత్వాలు కేంద్ర మార్గదర్శకాలను అనుసరించాలని కోరారు. 1.54 కోట్ల పీపీఈలు, 49 వేల వెంటిలేటర్లకు ఆర్డర్ ఇచ్చినట్లు లవ్ అగర్వాల్ వెల్లడించారు. అంతేకాకుండా ఇప్పటివరకు 5 వేల రైలు పెట్టెలను ఐసొలేషన్ వార్డులుగా మార్చినట్లు ఆయన స్పష్టం చేశారు.
18:47 April 09
పారిశుధ్య కార్మికులకు రక్షణ కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశంలోని పారిశుధ్య కార్మికులకు రక్షణ కల్పించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దిల్లీ సఫాయి కర్మచారీస్ కమిషన్ మాజీ ఛైర్మన్ హర్మన్ సింగ్ ఈ పిటిషన్ వేశారు. 24 గంటల్లో పారిశుధ్య కార్మికులకు రక్షణ సామాగ్రి అందించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలివ్వాలని పిటిషనర్ న్యాయస్థానాన్ని కోరారు. అలాగే 48 గంటల్లో కార్మికులతో సహా కుటుంబ సభ్యులకు కరోనా పరీక్షలు నిర్వహించాలన్నారు. పారిశుధ్య కార్మికులు విధులు నిర్వహించే సమయంలో పీపీఈ కిట్లు వాడేలా డబ్ల్యూహెచ్‌వో మార్గదర్శకాలు ఇచ్చిందని హర్మన్ సింగ్ పిటిషన్లో ప్రస్తావించారు.
18:14 April 09
15 వేల కోట్లతో కరోనా 'అత్యవసర నిధి'
కొవిడ్-19 ఎమర్జెనీ రెస్పాన్స్ అండ్ హెల్త్ సిస్టం ప్రిపేర్డ్నెస్ ప్యాకేజీ కింద రూ.15 వేల కోట్లు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. ఇందులోని రూ.7,774 కోట్లను అత్యవసర సౌకర్యాల కల్పన కోసం వినియోగించనున్నారు. రూ.4,113 కోట్లను వచ్చే నాలుగేళ్లలో ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
17:40 April 09
తమిళనాడుపై కరోనా పంజా..
తమిళనాడులో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 96 కేసులు కొత్తగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం బాధితుల సంఖ్య 834కు చేరింది.
17:33 April 09
భారత్‌లో కరోనా మరణాలు @ 169
దేశంలో కరోనా మరణాలు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 591 కేసులు, 24 మరణాలు సంభవించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 5865కు చేరింది. ఇందులో 5218 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 478 కోలుకోగా.. 169 మంది మరణించారు.
17:14 April 09
ధారావిలో మరో వ్యక్తి మృతి:
ఆసియాలోనే అతిపెద్ద మురికివాడైన మహారాష్ట్రలోని ధారావిలో మరో వ్యక్తి కరోనాతో చనిపోయాడు. ఫలితంగా ఈ ప్రాంతంలో మృతుల సంఖ్య మూడుకు చేరింది.
16:58 April 09
జమ్మూకశ్మీర్‌లో 24 కేసులు:
జమ్మూకశ్మీర్‌లో కొత్తగా 24 కరోనా కేసులు నమోదయ్యాయి. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం బాధితుల సంఖ్య 184కి చేరింది.
16:41 April 09
24 గంటల్లో 549 కరోనా కేసులు:
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రతాపం కనిపిస్తోంది. గత 24 గంటల్లో 549 కొత్త కేసులు సహా 17 మరణాలు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం కేసుల సంఖ్య 5,734కు చేరగా... ఇందులో యాక్టివ్ కేసులు 5,095. మరో 473 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు మొత్తం 166 మంది ప్రాణాలు కోల్పోయారు.
16:33 April 09
దక్షిణకొరియా అధ్యక్షుడికి మోదీ ఫోన్‌కాల్:
కరోనాపై పోరులో భాగంగా వివిధ దేశాల అధ్యక్షులను సంప్రదిస్తున్నారు ప్రధాని మోదీ. తాజాగా దక్షిణకొరియా అధ్యక్షుడు మూన్జే-ఇన్‌తో ఫోన్లో సంభాషించారు. మహమ్మారిపై పోరాటానికి సహాకరించుకునేందుకు ఇరు దేశాలు ముందుకొచ్చాయి. కరోనా కట్టడిలో ఆ దేశంలో పాటిస్తున్న పద్ధతులు, విధానాలపైనా మోదీ వివరాలు అడిగి తెలుసుకున్నారు.
16:00 April 09
కరోనా వైరస్‌తో 63 ఏళ్ల డాక్టర్ మృతి
కరోనా వైరస్ కారణంగా ఓ వైద్యుడు మృతి చెందాడు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లాకు చెందిన 62 ఏళ్ల ఓ డాక్టర్.. ఈరోజు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కరోనా పరీక్షల్లో అతడికి పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. వైరస్ సోకిన ఓ వ్యక్తిని పర్యవేక్షించే క్రమంలోనే వైద్యుడికి వైరస్ సోకినట్లు అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం దీనిపై విచారణ జరుగుతున్నట్లు తెలిపారు. కాంటాక్ట్ ట్రేసింగ్, ఆ పేషెంట్ ఎవరనేదానిపైనా యంత్రాంగం దృష్టి సారించినట్లు వెల్లడించారు.
ఈ మృతితో ఇండోర్ జిల్లాలో మొత్తం మరణాల సంఖ్య 22కి చేరింది. ఇప్పటివరకు ఇక్కడ 213 పాజిటివ్ కేసులు రావడం వల్ల హాట్‌స్పాట్‌గా ప్రకటించారు.
15:43 April 09
'మహిళలూ.. అవి పుకార్లు మాత్రమే'
జన్‌ధన్ అకౌంట్లలో నెలవారీగా ఐదు వందల రూపాయల చొప్పున మూడు నెలల పాటు మొత్తం రూ.1,500 వేయనున్నట్లు క్లారిటీ ఇచ్చింది కేంద్ర ఆర్థికశాఖ. ఏప్రిల్ నుంచే ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు నేడు ప్రకటన చేసింది. డబ్బులు వేసిన తర్వాత తీసుకోకపోతే వెనక్కి వెళ్లిపోతాయని వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ పుకార్లతో బ్యాంక్‌ల వద్ద రద్దీ ఏర్పడుతోందని.. భౌతిక దూరం పాటించకపోతే కరోనా వ్యాప్తి ఎక్కువతుందని ప్రజలకు సూచించింది. వీలున్న సమయంలో వెళ్లి డబ్బులు తీసుకోవాలని స్పష్టం చేసింది.
కరోనా లాక్డౌన్ నేపథ్యంలో దినసరి కూలీలు, పేదప్రజలు ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన ద్వారా దాదాపు 20.50 కోట్ల మంది మహిళలకు లబ్ధి చేకూర్చే నిర్ణయం తీసుకుంది కేంద్రం. ఇలా రూ.1,500 కోసం దాదాపు రూ.1 లక్ష 19వేల కోట్లు కేటాయించినట్లు ప్రభుత్వం తెలిపింది.
15:35 April 09
స్పెయిన్‌లో తగ్గుతున్న కరోనా మరణాలు:
స్పెయిన్‌లో కరోనా మరణాల సంఖ్య నెమ్మదిగా తగ్గుతోంది. ఈ దేశంలో మొత్తం మృతుల సంఖ్య 15 వేలు దాటేసింది. ఇప్పటి వరకు 1,48,220 మందికి వైరస్ సోకగా.. ఇందులో 48,021 మంది కోలుకున్నారు.
ఇరాన్లో మరో 117 మంది కరోనా కారణంగా చనిపోయారు. ఫలితంగా మొత్తం మరణాల సంఖ్య 4వేలు దాటింది. ఇప్పటివరకు దాదాపు 64,586 కేసులు నమోదు కాగా... 29,812 మంది కోలుకున్నారు.
15:28 April 09
మహారాష్ట్ర ఎమ్మెల్యేల వేతనాల్లో 30 శాతం కోత:
కరోనా లాక్డౌన్ ప్రభావంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్న నేపథ్యంలో.. మహారాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రులు, ఎమ్మెల్యేల వేతనాల నుంచి 30 శాతం కోత విధించే నిర్ణయానికి ఆమోదం తెలిపింది. ఫలితంగా ఏప్రిల్ నుంచి ఏడాది పాటు వేతనాల్లో కోత నిర్ణయం అమలు చేయనున్నారు.
కేంద్ర ప్రభుత్వం ఇటీవలె ఎంపీల వేతనాల్లో 30 శాతం కోత విధిస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది. ఈరోజే కర్ణాటక కూడా ఇదే తరహా నిర్ణయం తీసుకుంది.
15:23 April 09
డాక్టర్‌కు కరోనా పాజిటివ్...
ఓ వైద్యుడు, అతడి భార్యతో పాటు మరో నలుగురుకి కరోనా వైరస్ సోకింది. మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. మొత్తం ఆరుగురూ క్షేమంగానే ఉన్నారని... అయితే వారందరికీ 14 రోజులు హోమ్ క్వారంటైన్ సూచించినట్లు అధికారులు తెలిపారు.
15:15 April 09
రాజస్థాన్‌లో 43 కేసులు:
రాజస్థాన్‌లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. తాజాగా 43 మందికి వైరస్ సోకినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో భన్వారా-2, జైపుర్-11, జైసల్మేర్-5, ఝుంఝును-7, జోధ్‌పుర్-3, బర్మేర్-1, టోంక్, జల్వార్ నుంచి తలో 7 కేసులు వచ్చినట్లు తెలిపారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కేసుల సంఖ్య 430కి చేరింది.
15:07 April 09
#WATCH Assam: Water in Brahmaputra river looks cleaner as industrial units remain shut in Guwahati, amid #CoronavirusLockdown. pic.twitter.com/YBSsjfgzZr
— ANI (@ANI) April 9, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="">#WATCH Assam: Water in Brahmaputra river looks cleaner as industrial units remain shut in Guwahati, amid #CoronavirusLockdown. pic.twitter.com/YBSsjfgzZr
— ANI (@ANI) April 9, 2020

బ్రహ్మపుత్ర నదిలో క్లీన్ వాటర్...
కరోనా వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్డౌన్ కారణంగా నదులన్నీ స్వచ్ఛంగా మారుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో ఫ్యాక్టరీలు మూతపడటం వల్ల కాలుష్యమూ తగ్గుతోంది. ప్రస్తుతం అసోం వద్ద బ్రహ్మపుత్ర నది పరిశుభ్రంగా దర్శనమిస్తోంది.
15:00 April 09
పంజాబ్‌లో తొలి హాట్‌స్పాట్ గుర్తింపు:
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా కొవిడ్-19 హాట్‌స్పాట్‌ను గుర్తించింది పంజాబ్ ప్రభుత్వం. ఆ రాష్ట్రంలో 21 కేసులు నమోదైన జవహర్పుర్ను హాట్‌స్పాట్‌గా ప్రకటించింది. ఈ ప్రాంతంలో ర్యాపిడ్ టెస్టులు నిర్వహించడమే కాకుండా 100 శాతం లాక్‌డౌన్‌ను అమలుచేయనున్నారు.
14:46 April 09
Federation of Resident Doctors Association (FORDA) writes to Union Home Minister Amit Shah over 'multiple incidents of assault on doctors and the need of Central Protection Act for doctors'. #COVID19 pic.twitter.com/Fc8vAP7G1V
— ANI (@ANI) April 9, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="">Federation of Resident Doctors Association (FORDA) writes to Union Home Minister Amit Shah over 'multiple incidents of assault on doctors and the need of Central Protection Act for doctors'. #COVID19 pic.twitter.com/Fc8vAP7G1V

'డాక్టర్లకు రక్షణ కావాలి'
దేశవ్యాప్తంగా వైద్యులపై జరిగిన దాడులను ప్రస్తావిస్తూ.. వెంటనే చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాసింది భారత రెసిడెంటు డాక్టర్ల సంఘం(ఫోర్డా). కేంద్ర దళాలతో రక్షణ ఏర్పాట్లు చేయాలని కోరారు.
14:25 April 09
ఎమ్మెల్యేలు, మంత్రుల జీతాల్లో 30 శాతం కోత
కర్ణాటక సీఎం యడియూరప్ప అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఏడాది జీతభత్యాలలో 30 శాతం కోత విధించనున్నారు. ఇందుకు మంత్రివర్గమూ ఆమోదం తెలిపారు. ఈ విధంగా దాదాపు రూ.15.36 కోట్లు సమకూర్చుకోనున్నారు. ఇందుకు ఈరోజే ఆర్డినెన్స్ పెట్టే విషయంపైనా చర్చిస్తున్నట్లు సమాచారం. లాక్డౌన్ పొడిగింపు, మద్య దుకాణాల పునరుద్ధరణ వంటి అంశాలపైనా ఇంకా తుది నిర్ణయం ప్రకటించాల్సి ఉంది.
14:15 April 09
కోర్టులకు సెలవుల్లేవ్
హైకోర్టు సహా తమ పరిధిలోని దిగువ స్థాయి కోర్టులకు వేసవి సెలవులు రద్దు చేసింది దిల్లీ హైకోర్టు. జూన్ వరకు కార్యకలాపాలు యథాతథంగా కొనసాగుతాయని స్పష్టం చేసింది.
14:06 April 09
బిహార్‌లో మరో 12 కేసులు
బిహార్‌లో మరో 12 మందికి కరోనా సోకినట్లు నిర్ధరణ అయింది. ఆ రాష్ట్రంలో బాధితుల సంఖ్య 51కి చేరింది.
13:13 April 09
లాక్డౌన్ ఉల్లంఘనులు పెరుగుతున్నారు!
లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తూ పోలీసులకు చిక్కుతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. ముంబయిలో గత 24 గంటల్లో 464 మందిపై కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మార్చి 20 నుంచి ఇప్పటివరకు నిబంధనలు పాటించనివారి సంఖ్య 3,634కు చేరింది. వీరందరిపై కేసులు పెట్టగా.. 2,850 మంది బెయిల్‌పై విడుదలయినట్లు ఆ రాష్ట్ర అధికారిక వర్గాలు వెల్లడించాయి.
బిహార్‌లోని పాట్నాలో లాక్డౌన్ ఉల్లంఘించిన వారికి భారీగా జరిమానాలు విధిస్తున్నారు. లాక్డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు రూ.2.47 కోట్ల రూపాయలు ఫైన్ల ద్వారా వచ్చినట్లు అధికారులు తెలిపారు.
13:01 April 09
దిల్లీలో 23 కరోనా హాట్స్పాట్లు:
దేశరాజధానిలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న 23 ప్రాంతాలను హాట్స్పాట్లుగా గుర్తించింది కేజ్రీవాల్ ప్రభుత్వం. ఆ ప్రాంతాల్లో వైరస్ కేసులు నియంత్రించేందుకు పకడ్బంది చర్యలు అమలు చేయనుంది. ర్యాపిడ్ టెస్టులు సహా లాక్‌డౌన్‌ను 100 శాతం అమలు చేసేందుకు ప్రణాళిక రచిస్తోంది.
12:55 April 09
'అత్యవసర' ప్యాకేజీకి కేంద్రం ఆమోదం:
కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా రాష్ట్రాలు/కేంద్రాలకు ప్రకటించిన అత్యవసర ప్యాకేజీకి ఆమోదం తెలిపింది కేంద్రం. ఈ నిధుల ద్వారా వైద్య పరికరాలు, మందులు సమకూర్చుకోవడం, పర్యవేక్షణ, వైరస్ అడ్డుకట్ట చర్యలు మెరుగుపర్చుకునేందుకు ఉపయోగించుకోవాలని సూచించింది. ఇందులో భాగంగా జనవరి 2020 నుంచి మార్చి 2024 వరకు మూడు దశలుగా నిధులు అందించనున్నట్లు తెలిపింది.
12:29 April 09
'జూన్ 17 వరకు విద్యాసంస్థలు లాక్‌డౌన్‌లోనే'
కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా కేంద్రానికి పలు సూచనలు చేశారు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్. ఏప్రిల్ 30 వరకు రైలు, విమాన సేవలను పునరుద్ధరించవద్దని ఆయన సూచించారు.
21 రోజుల లాక్డౌన్ ఏప్రిల్ 14తో ముగియనుండగా.. మరో కీలక ప్రకటన చేసింది ఒడిశా ప్రభుత్వం. ఆ రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను ఏప్రిల్ 30 వరకు పొడిగించేందుకు నిర్ణయం తీసుకుంది. ఇక విద్యాసంస్థలైతే జూన్ 17 వరకు తెరిచేందుకు వీలులేదని స్పష్టం చేసింది.
12:05 April 09
పంజాబ్‌లో ఇద్దరు మృతి:
కరోనా కారణంగా పంజాబ్‌లో మరో ఇద్దరు మృతి చెందారు. ఈ రాష్ట్రంలో ఇప్పటివరకు 114 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా.. మొత్తం 10 మంది మరణించారు.
12:01 April 09
కరోనా మృతులు:
దేశంలో కరోనా మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కర్ణాటకలోని గడగ్ జిల్లాలో 80 ఏళ్ల వృద్ధురాలు గుండెపోటుతో మరణించింది. ఈమెకు వైద్య పరీక్షలు నిర్వహించగా.. కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఆ రాష్ట్ర వైద్య విభాగం ధ్రువీకరించింది.
గుజరాత్లో 48 ఏళ్ల వ్యక్తి కరోనా బారిన పడి మృతి చెందాడు. ఫలితంగా ఈ రాష్ట్రంలో మృతుల సంఖ్య 17కి చేరింది.
11:36 April 09
మద్యం అమ్మకాలపై సందిగ్ధం.. నేడు కేబినెట్ సమావేశం
లాక్డౌన్ కారణంగా దేశ వ్యాప్తంగా మద్యం దుకాణాలు మూతపడ్డాయి. ఏప్రిల్ 14 తర్వాత కర్ణాటకలో మళ్లీ వాటి అమ్మకాలు పునః ప్రారంభించేందుకు ప్రణాళికలు రచిస్తోంది అక్కడి ప్రభుత్వం. ఈ అంశంపై నేడు కేబినెట్ సమావేశం నిర్వహించి కీలక నిర్ణయం ప్రకటించనుంది. మద్యం అమ్మకాలు నిలిపివేయడం వల్ల నెలకు రూ.1800 కోట్లు నష్టపోతున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వెల్లడించింది.
11:30 April 09
ప్రపంచంపై కరోనా పంజా... 15 లక్షల కేసులు
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలన్నింటిపై తన ప్రతాపం చూపిస్తోంది. ఇప్పటివరకు ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య 15 లక్షలకు చేరింది. ఇందులో 88వేల 500 మంది చనిపోయారు.
ఇటలీలో అత్యధిక మరణాలు సంభవించాయి. ఈ ఒక్క దేశంలోనే దాదాపు 17వేల మంది వైరస్ బారిన పడి మృతి చెందారు. ఆ తర్వాత స్థానంలో అమెరికా, స్పెయిన్ ఉన్నట్లు జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం నివేదిక ద్వారా వెల్లడైంది.
11:27 April 09
మహారాష్ట్రలో 162 కేసులు:
మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి ఎక్కువగా కనిపిస్తోంది. గత 24 గంటల్లో 162 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో 143 కేసులు ముంబయి నుంచే వచ్చాయి. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం వైరస్ బాధితుల సంఖ్య 1397కి చేరింది.
11:25 April 09
గుజరాత్లో 55 కొత్త కేసులు:
గుజరాత్లో కొత్తగా 55 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 50 కేసులు ఒక్క అహ్మదాబాద్ నుంచే వచ్చాయి. ఈ రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 241కి చేరింది.
11:15 April 09
కరోనా కోసం 10 డ్రగ్‌లు ట్రయల్స్‌లో ఉన్నాయి: ట్రంప్
కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా పలు దేశాలు, పరిశోధనా సంస్థలు కలిసి ఈ వైరస్‌కు మందు కనిపెట్టే ప్రయత్నాల్లో ఉన్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే అమెరికాలో 10 డ్రగ్స్ క్లినికల్ ట్రయల్స్‌లో ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. వీలైనంత త్వరగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఆయన వెల్లడించారు.
ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఈ మహమ్మారి దెబ్బకు 15 లక్షల మందికి బాధితులుగా మారారు. ఇందులో 88వేల 500 మంది చనిపోయారు. ఒక్క అమెరికాలోనే 4లక్షల 30 వేల మందికి ఈ వైరస్ సోకగా... 14వేల 700 మంది మృతిచెందారు.
11:07 April 09
ముంబయికి దక్షిణకొరియా కిట్లు!
దేశవ్యాప్తంగా చూస్తే మహారాష్ట్రపై కరోనా ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఇప్పటికే బాధితుల సంఖ్య 1135కు చేరగా.. 72 మంది మృతి చెందారు. ఈ నేపథ్యంలో ముంబయిలో ప్రజలు కచ్చితంగా మాస్కులు ధరించాలని ఆదేశాలు జారీ చేసింది ముంబయి మున్సిపల్ కార్పోరేషన్. అంతేకాకుండా ర్యాపిడ్ టెస్టుల కోసం ప్రణాళికలు రచిస్తోంది. ఇందుకోసం తాజాగా లక్ష ర్యాపిడ్ టెస్టు కిట్లు కావాలని దక్షిణకొరియాకు ఆర్డర్ ఇచ్చింది. ఇవి అందుబాటులోకి వస్తే వేగంగా టెస్టులు నిర్వహించి బాధితులను కనుక్కోనున్నారు.
11:01 April 09
దిల్లీలో కరోనా కేసులు @ 669
దిల్లీలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గురువారం నాటికి దేశ రాజధాని ప్రాంతంలో 669 కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇందులో 426 మందికి గత నెల నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లీగీ జమాత్‌తో సంబంధం ఉన్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
10:58 April 09
ఝార్ఖండ్‌లో తొలి మరణం:
ఝార్ఖండ్‌లో తొలి కరోనా మరణం నమోదైంది. బొకారో ప్రాంతానికి చెందిన 75 ఏళ్ల ఓ వ్యక్తి వైరస్ సోకి మరణించినట్లు వైద్యులు వెల్లడించారు.
10:47 April 09
ప్రైవేట్ స్కూళ్లకు ప్రభుత్వం షాక్:
కరోనా కారణంగా దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్డౌన్ ప్రకటనతో పాఠశాలలు, కళాశాలలు మూతపడ్డాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజల జీవనమే ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలోనూ పంజాబ్‌లోని కొన్ని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఫీజులు చెల్లించాలని తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నాయి. ఈ విషయం పలువురు ఫిర్యాదులు చేయగా.. పంజాబ్ విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ప్రభుత్వం ఆదేశాలను బేఖాతరు చేశారంటూ మొత్తం 38 ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలకు నోటీసులు జారీ చేసింది. తక్షణమే వాటికి సమాధానాలివ్వాలని చెప్పింది.
10:38 April 09
జలంధర్‌లో వ్యక్తి మృతి:
కరోనా కారణంగా పంజాబ్‌లోని జలంధర్‌లో ఓ వ్యక్తి మృతి చెందాడు. 59 ఏళ్ల వయసున్న ఆయన బుధవారం వైరస్ కారణంగానే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. రెండు రోజులు వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ మరణించినట్లు స్పష్టం చేశారు.
10:34 April 09
ప్రపంచవ్యాప్తంగా కరోనా మృతులు @ 88,000
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలన్నింటిపై తన ప్రతాపం చూపిస్తోంది. ఇప్పటివరకు ఈ వైరస్ కారణంగా మృతి చెందినవారి సంఖ్య 88వేలు దాటేసింది. ఇటలీలో అత్యధిక మరణాలు సంభవించాయి. ఈ ఒక్క దేశంలోనే దాదాపు 17వేల మంది వైరస్ బారిన పడి మృతి చెందారు. ఆ తర్వాత స్థానంలో అమెరికా, స్పెయిన్ ఉన్నట్లు జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం నివేదిక ద్వారా వెల్లడైంది.
10:08 April 09
కరోనాపై ఐరాస భద్రతా మండలిలో చర్చ:
కరోనాతో ప్రపంచ దేశాలు వణికిపోతుంటే ఐరాస భద్రతా మండలి (యుఎన్ఎస్సీ) ఇప్పటివరకు ఈ అంశంపై చర్చించలేదు. ఈ విషయంపై విమర్శలు రాగా.. తొలిసారి మహమ్మారిపై చర్చకు పిలుపునిచ్చింది. ఏప్రిల్ 10న ఈ అంశంపై మాట్లాడేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. ఇందులో పాల్గొనే 15 మంది సభ్యులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించనున్నారు.
చైనా, అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, రష్యా సహా మరో పది దేశాలు(బెల్జియం, డొమినియన్ రిపబ్లిక్, ఎస్తోనియా, జర్మనీ, ఇండోనేషియా, నిగర్, సెయింట్ విన్సెంట్, దక్షిణాఫ్రికా, ట్యూనీషియా, వియాత్నం) పాలుపంచుకోనున్నాయి. ఇందులో ఇప్పటికీ భారత్‌కు ప్రాతిధ్యం ఇవ్వకపోవడం గమనార్హం.
09:33 April 09
చైనాలో పెరుగుతున్న 2.ఓ కేసులు:
చైనాలో రెండో దశ కరోనా కేసులు పెరుగుతున్నాయి. లక్షణాలు లేని వైరస్ కేసులు కొత్తగా 63 నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఫలితంగా ఈ బాధితుల సంఖ్య మొత్తం 1,104కి చేరింది.
గురువారం చైనాలో రెండు కరోనా మరణాలు నమోదయ్యాయి. మొత్తం మృతుల సంఖ్య 3,335కి చేరింది. దేశంలో 81,865 మంది కరోనా బారిన పడినట్లు ఆ దేశ వైద్య విభాగం వెల్లడించింది.
08:35 April 09
కరోనా పంజా: 12 గంటల్లో 17 మంది బలి
దేశంలో కరోనా మృతుల సంఖ్య మరింత పెరిగింది. ఇప్పటివరకు మొత్తం 166 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం కేసుల సంఖ్య 5,734కు చేరింది. ఇందులో యాక్టివ్ కేసులు 5,095. మరో 472 మంది కోలుకున్నారు.