ETV Bharat / bharat

కరోనా పంజా: ముంబయిలో ఒక్కరోజులో 357మందికి కరోనా

CORONA
కరోనా
author img

By

Published : Apr 24, 2020, 8:50 AM IST

Updated : Apr 24, 2020, 11:27 PM IST

21:59 April 24

9 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లకు కరోనా పాజిటివ్‌

దిల్లీలోని నరేలా క్వారంటైన్‌కు తరలించిన 47 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లలో తాజాగా 9 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వారిని ఐసోలేషన్‌ వార్డుకు తరలించినట్లు సీఆర్పీఎఫ్‌ వర్గాల సమాచారం.

21:53 April 24

బిహార్​లో 223కు చేరిన కరోనా కేసులు

బిహార్​లో కరోనా క్రమంగా విస్తరిస్తోంది. ఈరోజు మరో 9 మందికి పాజిటివ్​గా తేలింది. దీంతో ఈ రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 223కు చేరింది. 

20:51 April 24

గుజరాత్​లో 191 మందికి కరోనా

గుజరాత్​లో కొత్తగా 191 మందికి కరోనా సోకింది. ఇందులో అహ్మదాబాద్​ నుంచే 169 మంది బాధితులు ఉన్నారు. గత 24 గంటల్లో 15 మంది ప్రాణాలు కోల్పోగా... మరణాల సంఖ్య 127కి చేరింది. ఇప్పటివరకు 265 మంది కోలుకున్నారు. మొత్తం బాధితుల సంఖ్య 2815కు పెరిగింది.  

20:39 April 24

హరియాణాలో కొత్తగా ఐదుగురికి కొవిడ్-19

హరియాణాలో మరో ఐదుగురికి కరోనా సోకింది. దీంతో రాష్ట్రంలో వైరస్ బాధితుల సంఖ్య 275కు చేరింది. ఇప్పటివరకు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

20:28 April 24

ముంబయిలో పెరిగిన కేసులు..

ముంబయిలో కొత్తగా మరో 357 మందికి కరోనా సోకింది. నగరంలో కేసుల సంఖ్య 4,589కి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా 24 గంటల్లో 394 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులో 19 మంది మరణించగా.. అందులో 11 మంది ముంబయికి చెందినవారే ఉన్నారు.

20:02 April 24

మధ్యప్రదేశ్​లో కరోనా ఎఫెక్ట్​

మధ్యప్రదేశ్​లో గత 24 గంటల్లో 159 కరోనా పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 1,846కు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 92 మంది మృతి చెందారు.

19:55 April 24

ధారవిలో ఆరు కేసులు..

ముంబయిలోని ధారవిలో మరో ఆరు కరోనా కేసులు నమోదయ్యాయి. ఫలితంగా ఈ ప్రాంతంలో బాధితుల సంఖ్య 220కి చేరింది.

18:46 April 24

తమిళనాడులో ఇద్దరు మృతి...

కరోనా కారణంగా తమిళనాడులో మరో ఇద్దరు చనిపోయారు. తాజాగా 72 కేసులు నమోదవగా.. మొత్తం బాధితుల సంఖ్య 1,755కు చేరింది.

18:42 April 24

కేరళలో 4 నెలల పసిబిడ్డ మృతి...

కేరళలో నాలుగు నెలల పసికందు కరోనాతో చనిపోయింది. ఈ రాష్ట్రంలో మృతి చెందిన అతి చిన్న వయస్కురాలిగా అధికారులు ధ్రువీకరించారు. తాజాగా మరో 3 కరోనా పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 450కి చేరింది.

18:10 April 24

భారత్​లో కరోనా కేసులు..

దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. మొత్తం బాధితుల సంఖ్య 23,452కు చేరింది. ఇందులో 4814 మంది కోలుకోగా.. 723 మంది మృతి చెందారు. 17,915 యాక్టివ్​ కేసులు ఉన్నాయి.

17:44 April 24

కరోనా వ్యాప్తి నేపథ్యంలో అహ్మదాబాద్​, సూరత్​, ఠాణె, హైదరాబాద్​, చెన్నై నగరాల్లో పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని కేంద్ర హోంశాఖ తెలిపింది.

16:55 April 24

ఉత్తర్​ప్రదేశ్​లో కొత్తగా 94 మందికి కరోనా సోకింది. రాష్ట్రంలో కేసుల సంఖ్య 1,600 దాటింది.

16:43 April 24

బిహార్​లో మరో 15 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 197కు చేరినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.

16:26 April 24

  • మరో 4 అంతర్​మంత్రిత్వ శాఖల బృందాలను ఏర్పాటు చేసిన కేంద్రం.
  • అహ్మదాబాద్, సూరత్, ఠాణె, హైదరాబాద్, చెన్నైలకు పంపనున్నట్లు ప్రకటించిన కేంద్రం.
  • ఇప్పటికే నియమించిన ఆరు కమిటీలు ఒక్కొక్కటి నివేదికలు పంపుతున్నాయని కేంద్రం హోం మంత్రిత్వ శాఖ వెల్లడి.
  • లాక్​డౌన్​ మార్గదర్శకాలు అమలవుతున్న విధానం, సామాజిక దూరం అమలు, ఆరోగ్య మౌలిక సదుపాయాల కల్పన, నిత్యావసరాల సరఫరా, వైద్య సిబ్బందికి భద్రత, సహాయ శిబిరాల్లో పరిస్థితిపై సమీక్ష చేసి నివేదిక ఇవ్వనున్న బృందాలు.

16:09 April 24

దేశంలో రికవరీ రేటు 20.57 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. గత 14 రోజుల్లో దేశవ్యాప్తంగా 80 జిల్లాల్లో కొత్త కేసులు నమోదు కాలేదని స్పష్టం చేసింది.  

15:55 April 24

సింగపూర్‌కు సాయం..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సింగపూర్‌ ప్రధాని లీ హైన్ ‌లూంగ్‌తో ఫోన్లో మాట్లాడినట్టు పీఎంవో వెల్లడించింది. కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న వేళ ఇరువురు నేతలు ప్రపంచం ఎదుర్కొంటున్న ఆరోగ్య, ఆర్థిక సవాళ్లపై పరస్పరం చర్చించుకున్నట్టు తెలిపింది. ఈ నేపథ్యంలో సింగపూర్​కు ఔషధ సాయానికి మోదీ హామీ ఇచ్చారు.

14:33 April 24

రాజస్థాన్​లో...

రాజస్థాన్‌లో ఈ రోజు 44 పాజిటివ్‌ కేసులు, మూడు మరణాలు నమోదయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 2008కి చేరగా.. 31 మంది ప్రాణాలు కోల్పోయారు. 

14:31 April 24

ప్లాస్మా థెరఫీతో...

దిల్లీలో కరోనా రోగులకు నిర్వహించిన ప్లాస్మా థెరఫీతో సంతృప్తికరమైన ఫలితాలు వస్తున్నాయని సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. ఇప్పటివరకు నలుగురు కరోనా రోగులపై ప్లాస్మా థెరఫీ క్లినికల్‌ ట్రైల్స్‌ నిర్వహించినట్టు చెప్పారు. వచ్చే రెండు మూడు రోజుల్లో  వీటిని మరింతగా పెంచుతామన్నారు. కరోనాతో పోరాడి కోలుకున్నవారు తమ ప్లాస్మాను దానం చేయాలని కేజ్రీవాల్​ విజ్ఞప్తి చేశారు.

12:38 April 24

కర్ణాటకలో 463...

కర్ణాటకలో కొత్తగా 18 మందికి కరోనా సోకింది. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 463కు చేరినట్లు అధికారులు తెలిపారు.

11:47 April 24

మహారాష్ట్రలో కొత్తగా 778 కేసులు నమోదుకాగా 14 మంది మరణించారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,427కు చేరగా మృతుల సంఖ్య 283కు పెరిగినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

11:36 April 24

ఈ-గ్రామస్వరాజ్‌ పోర్టల్, మొబైల్ యాప్ ద్వారా ఎన్నో సేవలు పొందవచ్చని మోదీ అన్నారు. ఈ-గ్రామస్వరాజ్‌ పోర్టల్ వల్ల బ్యాంకు రుణాలు తీసుకోవడం, గ్రామాల్లో సమస్యలు గుర్తించి పరిష్కరించడం సులభమన్నారు ప్రధాని.

11:26 April 24

పంచాయతీ వ్యవస్థ ఎంత బలపడితే ప్రజాస్వామ్యం అంతగా బలపడుతుందని మోదీ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం లక్షా 25 వేల పంచాయతీల్లో బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు అందుతున్నాయన్నారు.

11:21 April 24

కరోనాపై గ్రామ ప్రజలకు మరింత అవగాహన, చైతన్యం కలిగించాలని సర్పంచ్​లకు ప్రధాని మోదీ దిశానిర్దేశం చేశారు. మనం వెళ్లే దారిలో అనేక ఆటంకాలు కలుగుతున్నాయని, కరోనా వైరస్‌ మనకు ఎన్నో పాఠాలు నేర్పిందన్నారు ప్రధాని. కరోనా సంక్షోభ సమయంలో ఆత్మనిర్భరంతో ఉండాలన్నారు మోదీ. ఈ సమయంలో ప్రజలంతా ఇళ్లలోనే ఉండి కరోనాను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.

11:20 April 24

మెరుగైన సేవలు అందించి పురస్కారాలు సాధించిన సర్పంచులకు అభినందనలు తెలిపారు మోదీ. గ్రామాల్లో సుపరిపాలన అందించేందుకు పంచాయతీరాజ్‌ శాఖ ఎంతో కృషి చేస్తోందన్నారు.

11:13 April 24

ఈ-గ్రామ స్వరాజ్ పోర్టల్ ప్రారంభించిన ప్రధాని మోదీ.

11:09 April 24

విద్యుత్‌, రహదారులు, పారిశుద్ధ్యం మెరుగుకు చర్యలు చేపట్టాలని కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్​ తోమర్​ పేర్కొన్నారు. కరోనా సంక్షోభంలో పేదలకు సరిపడా ఆహారధాన్యాలు అందించాలన్నారు. ఈ-గ్రామస్వరాజ్‌ పోర్టల్​ను ప్రధాని మోదీ ప్రారంభించనున్నట్లు తెలిపారు.

11:06 April 24

  • దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన సర్పంచులతో మాట్లాడుతున్న ప్రధాని మోదీ
  • వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతున్న ప్రధాని మోదీ
  • తమ అభిప్రాయాలు, ఆలోచనలను ప్రధానితో పంచుకుంటున్న సర్పంచులు
  • పంచాయతీరాజ్‌ దినోత్సవం సందర్భంగా సర్పంచులతో మాట్లాడుతున్న మోదీ

10:05 April 24

రాజస్థాన్​లో 2 వేల కేసులు...

రాజస్థాన్​లో మరో 36 మందికి కరోనా సోకింది. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2000కు చేరింది. ఇప్పటివరకు 29 మంది ప్రాణాలు కోల్పోయారు.

09:29 April 24

కొత్త కేసులు...

మధ్యప్రదేశ్​లో మరో 128 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 85కు చేరింది.

08:47 April 24

ఒక్కరోజులో 37 కరోనా మరణాలు- 1,684 కేసులు

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గత 24 గంటల్లో 37 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 1,684 మంది వైరస్ బారిన పడ్డారు. కేంద్ర ఆరోగ్య శాఖ ఈమేరకు వెల్లడించింది.

  • మొత్తం కేసులు: 23,077
  • యాక్టివ్ కేసులు: 17,610
  • మరణాలు: 718
  • కోలుకున్నవారు: 4,748
  • వలస వెళ్లిన వారు: 1

Last Updated : Apr 24, 2020, 11:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.