ETV Bharat / bharat

మొబైల్​ ఫోన్​తో జర జాగ్రత్త.. వైరస్​ వ్యాపిస్తుంది!

author img

By

Published : May 16, 2020, 10:56 AM IST

మీరు హ్యాండ్​వాష్​లు, శానిటైజర్లతో ఎన్ని సార్లు చేతులు శుభ్రం చేసుకున్నా.. మీ మొబైల్​ ఫోన్​ వైరస్​ను అంటించే ప్రమాదముంది. ఒక్కసారి ఫోన్​పై వాలిన వైరస్​ సరాసరీ చేతులకు, మొహానికి తాకుతుంది. అందుకే ఆసుపత్రుల్లో మొబైల్‌ ఫోన్లే ప్రధాన వైరస్‌ వాహకాలంటున్నారు వైద్యులు.

CORONA TRANSMISSION THROUGH MOBILE PHONES
మొబైల్​ ఫోన్​తో వైరస్​ వ్యాపిస్తుంది!

మొబైల్‌ ఫోన్ల ద్వారా వైద్య సిబ్బందికి వైరస్‌ వ్యాపించే ప్రమాదముందని, ఆసుపత్రుల్లో వాటి వినియోగాన్ని పూర్తిగా కట్టడి చేయాలని ఎయిమ్స్‌-రాయ్‌పుర్‌ వైద్యులు సూచించారు. ఈ మేరకు డా.వినీత్‌కుమార్‌ పాఠక్‌ బృందం బీఎంజే గ్లోబల్‌ హెల్త్‌ పత్రికకు వ్యాసం అందించింది.

మొబైల్‌ ఫోన్లూ వైరస్‌ వాహకాలే. వాటి ఉపరితల భాగాలు అత్యంత ప్రమాదకరం. వాటిపై ఉండే వైరస్‌ నేరుగా మొహానికి, నోటికి, కళ్లకు అంటుకునే ప్రమాదముంది. తమ విధుల్లో భాగంగా వైద్య, ఆరోగ్య సిబ్బంది సగటున ప్రతి పదిహేను నిమిషాల నుంచి రెండు గంటలకు ఒకసారి ఫోన్లను వినియోగిస్తుంటారు. వారు తమ చేతులను ఎన్నిసార్లు శుభ్రం చేసుకున్నా, ఫోన్లను ముట్టుకోవడం ద్వారా వైరస్‌ మళ్లీమళ్లీ అంటుకునే ప్రమాదముంది.

ఈ విషయాన్ని గుర్తుంచుకుని ఫోన్ల వాడకాన్ని తగ్గించుకోవాలి. వెంటనే తగిన జాగ్రత్తలు పాటించాలి. ఫోన్లు, కంప్యూటర్‌ భాగాలను శుభ్రం చేసుకోవడానికి అనువైన పారదర్శక కవర్లతో కప్పి వాటిని వాడుకుంటే మేలు’’ అని పాఠక్‌ బృందం పేర్కొంది.

ఇదీ చదవండి:'సొంతూరు ప్రయాణం'తో కరోనా కేసుల్లో పెరుగుదల!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.