ETV Bharat / bharat

75ఏళ్ల వృద్ధుడు.. 5రోజులు.. 650కి.మీ సైకిల్​ ప్రయాణం - Detesting Urban Culture and Lifestyle, 75-yr-old Pedals 650 km from Chennai to be at Home in native Tirunelveli

కరోనా వేళ నగర జీవనంపై ఆ వృద్ధుడు విసుగు చెందాడు. తన స్వస్థలానికి వెళ్దామంటే రవాణా సదుపాయాలు లేవు. అయితే ఎలాగైనా నగరం నుంచి బయటపడాలనుకున్నాడు. 75 ఏళ్ల వృద్ధాప్యంలో పెద్ద సాహసమే చేశాడు. ఆయన కథేమిటో మీరే చూసేయండి.

Detesting Urban Culture and Lifestyle, 75-yr-old Pedals 650 km from Chennai to be at Home in native Tirunelveli
75 ఏళ్ల వృద్ధుడు.. 5 రోజుల్లో 650 కి.మీ సైక్లింగ్​!
author img

By

Published : Jul 23, 2020, 8:15 PM IST

Updated : Jul 24, 2020, 3:00 PM IST

సంకల్పానికి వయస్సు అడ్డంకి కాదని నిరూపించాడు తమిళనాడుకు చెందిన 75 ఏళ్ల వృద్ధుడు. చెన్నైలో కేసుల వ్యాప్తి.. ఒకరికొకరు సంబంధం లేకుండా ఉండే నగర వాతావరణంలో ఇమడలేక.. లాక్​డౌన్​ కారణంగా ఇంటికి వెళ్లలేక సతమతమయ్యాడు. ఎలాగైనా స్వగ్రామానికి వెళ్లిపోవాలని సంకల్పించి.. మనవడి సైకిలేసుకుని చెప్పాపెట్టకుండా ఊరికి పయనమయ్యాడు.

చెన్నై నుంచి తిరునల్వేలికి సైకిల్​పై ప్రయాణిస్తున్న 75 ఏళ్ల పాండియన్​

5 రోజుల్లోనే..

తమిళనాడు తిరునల్వేలీ జిల్లా తీవనాయగపెరిలోని సుదాలై మాదన్​కు చెందిన 75 ఏళ్ల పాండియన్.. కేరళ చంగనచెర్రీ లోని ఓ హోటల్​లో పనిచేస్తుండేవాడు. ఈ నేపథ్యంలో అనారోగ్యంతో ఉన్న మనవడిని చూసేందుకు చెన్నైకి వెళ్లాడు. కొద్దిరోజులకే కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు అక్కడ ప్రభుత్వం లాక్​డౌన్ విధించిన నేపథ్యంలో నగరంలో చిక్కుకుపోయాడు. నగర జీవనంపై విసుగెత్తిన పాండియన్​ ఇంట్లో చెప్పకుండా సైకిల్​పై సుదీర్ఘ ప్రయాణం చేశాడు. 5 రోజుల పాటు సైకిల్​పై ప్రయాణించి 650 కిలోమీటర్ల దూరంలోని స్వగ్రామానికి చేరాడు. అనంతరం ఊర్లోని ఆలయంలో 15 రోజులపాటు స్వీయ నిర్బంధంలో ఉన్నాడు పాండియన్​. ఆ తర్వాత ఇంటికి చేరుకున్న ఈ సాహస వీరుడి ప్రయాణం గురించి గ్రామంలోనే కాక చుట్టుపక్కల ప్రాంతాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఇదీ చదవండి: ఆరేళ్ల బాలుడు ఆస్పత్రిలో స్ట్రెచర్​ తోస్తూ...

Last Updated : Jul 24, 2020, 3:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.