ETV Bharat / bharat

కరోనా సోకింది.. బిర్యానీపై మనసు లాగింది!

ఒక్కసారి బిర్యానీ రుచిపై మోజుపడినవారు.. దానిని వదలగలరా? ఇక చికెన్​ తందూరీ అంటే ఎవరికైనా నోరూరకుండా ఉంటుందా? నాలుగు రోజులు నాన్​వెజ్​ లేకుంటే.. నాలుక చప్పబడిపోతుంది. మరి నెలల తరబడి తినకుండా ఉంటే ఎలా? అందుకేనేమో.. తమిళనాడు ఆసుపత్రిలో క్వారంటైన్​లో ఉన్న కరోనా బాధితులు ఆగలేక బిర్యానీ, తందూరి చికెన్ ఆర్డర్​ చేసుకున్నారు.

Corona patients order biryani, chicken via online shock doctors!
కరోనా సోకింది.. బిర్యానీపై మనసు లాగింది!
author img

By

Published : May 21, 2020, 1:26 PM IST

'అయ్యో.. బిర్యానీ వాసనచూసి ఎన్నాళ్లైంది.. ముక్క లేక ముద్ద దిగట్లేదే.. లెగ్​పీస్ ​ లాగించాలని మనసులాగుతోందే!' ఇదీ క్వారంటైన్​లో ఉన్న నలుగురు కరోనా బాధితుల ఆవేదన! అవును, యావత్​ భారతం కరోనా పంజాకు చిక్కకూడదని బిక్కుబిక్కుంటుంటే.. కరోనా సోకిన వారు మాత్రం ఆసుపత్రి నుంచే ఆన్​లైన్​లో బిర్యానీలు, తందూరీ చికెన్​లు ఆర్డర్​ చేసుకున్నారు.

కొద్ది రోజుల క్రితం తమిళనాడు సాలెం జిల్లా ఆసుపత్రికి కరోనా లక్షణాలతో వచ్చిన 35 మందికి వైరస్​ సోకినట్లు నిర్ధరించారు వైద్యులు. వారిని ఐసోలేషన్ వార్డులోనే నిర్బంధించి చికిత్స అందించారు. వారంతా ప్రస్తుతం కోలుకున్నారు. కొందరు ఇంటికి వెళ్లిపోగా.. ఇతర రాష్ట్రాలకు చెందిన 22 మందిని మాత్రం ఆసుపత్రిలోనే ఉంచారు వైద్యులు.

చికెన్​ తినక చాలా రోజులైందేమో.. వారిలో నలుగురు ముక్క తినాలని తహతహలాడారు. ఇంకేముంది వెంటనే ఫోన్​ తీసి.. ఆన్​లైన్​లో బిర్యానీ విత్​ తందూరీ చికెన్ ఆర్డర్​ కొట్టారు.

విషయం తెలుసుకున్న వైద్యులు నివ్వెరపోయారు. ఒకసారి కరోనా బారినపడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నవారు జాగ్రత్తగా ఉండాల్సిందిపోయి.. ఇలా బయటి ఆహారంపై మనసుపడడం ఏంటని బాధితులను హెచ్చరించారు.

ఇదీ చదవండి:మాస్క్​తో మార్నింగ్​ వాక్​.. చాలా డేంజర్​!​

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.