ETV Bharat / bharat

కరోనా కలవరం: ఇటలీలో 10వేలు దాటిన మరణాలు - కరోనా తాజా వార్తలు

virus
దేశంలో 873కు చేరిన వైరస్​ కేసులు
author img

By

Published : Mar 28, 2020, 9:07 AM IST

Updated : Mar 28, 2020, 11:51 PM IST

22:57 March 28

ఇటలీలో 10వేలు దాటిన కరోనా మరణాలు

ఐరోపా దేశం ఇటలీలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. వైరస్​ బారిన పడి మరణించిన వారి సంఖ్య 10వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో సుమారు 8వందలకుపైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. 

20:50 March 28

మరో 28 కేసులు...

మహారాష్ట్రలో మరో 28 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కేసుల సంఖ్య 181కి చేరింది.

20:29 March 28

పడిగాపులు...

దిల్లీ ఆనంద్ విహార్​ బస్​ టెర్మినల్​ వద్ద పెద్దఎత్తున వలస కూలీలు పడిగాపులుకాస్తున్నారు. వారి సొంతూళ్లకు వెళ్లేందుకు బస్సుల కోసం వేచిచూస్తున్నారు.

19:32 March 28

మరో 1000 కోట్లు...

కరోనాపై పోరాటానికి మరో 1000 కోట్లు ప్రకటించిన టాటా సంస్థలు​. ఇప్పటికే 500 కోట్లు ఇవ్వనున్నట్లు టాటా గ్రూప్స్​ తెలిపింది.

19:15 March 28

దేశంలో 918కి చేరిన కేసులు...

దేశంలో కరోనా కేసుల సంఖ్య 918కి చేరినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో 819 కేసులు కేసులు యాక్టివ్​గా ఉన్నట్లు స్పష్టం చేసింది. మొత్తం దేశంలో 19 మంది కరోనా ధాటికి మృతి చెందినట్లు పేర్కొంది.

18:55 March 28

వలస కూలీల కష్టాలు...

లౌక్​డౌన్​ అమలులో ఉన్నప్పటికీ దిల్లీ- ఉత్తర్​ప్రదేశ్​ సరిహద్దు వద్ద పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడారు. దిల్లీ ఆనంద్​ విహార్​ బస్​ టెర్మినల్​ వద్ద తమ సొంతూళ్లకు వెళ్లేందుకు యూపీ సర్కారు వారికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది.

18:48 March 28

కేరళలో మరో 6 కేసులు...

కేరళలో ఈ రోజు 6 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 165కు చేరినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్​ తెలిపారు.

17:36 March 28

టాటా ట్రస్ట్​...

కరోనా వైరస్​పై యుద్ధం చేయడానికి రూ.500 కోట్లు ప్రకటించింది టాటా ట్రస్ట్​. టాటా సంస్థల ఛైర్మన్​ రతన్​ టాటా ఈ మేరకు ప్రకటించారు.

17:23 March 28

అక్షయ్​ కుమార్​ భారీ విరాళం...

ప్రధాని ఇచ్చిన పిలుపు మేరకు బాలీవుడ్​ స్టార్​ హీరో అక్షయ్​ కుమార్​ పీఎం కేర్​ ఫండ్​కు రూ.25 కోట్లు విరాళం ఇచ్చారు. 

17:15 March 28

తొలి విరాళం...

పీఎం కేర్​ ఫండ్​కు ఐఏఎస్​ సంఘం రూ.21 లక్షలు విరాళమివ్వనున్నట్లు ప్రకటించింది. ఇదే పీఎం కేర్​ ఫండ్​కు తొలి విరాళం. కరోనాపై యుద్ధానికి ఐఏఎస్​లు అందరూ తమ ఒకరోజు జీతాన్ని కూడా అందించనున్నట్లు అసోసియేషన్​ ప్రకటించింది.

17:02 March 28

  • The PM-CARES Fund accepts micro-donations too. It will strengthen disaster management capacities & encourage research on protecting citizens. Let us leave no stone unturned to make India healthier and more prosperous for our future generations: PM Narendra Modi. https://t.co/HataV5DRqJ pic.twitter.com/fv2FeNQmwB

    — ANI (@ANI) March 28, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

విరాళాల సేకరణ...

కరోనా సహా ఆరోగ్య భారత్​ కోసం కొత్తంగా పీఎం కేర్స్​ ఫండ్​ ఏర్పాటు చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. దేశ ప్రజలు ఈ ఖాతాకు తమ విరాళాలు అందజేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. ఎంత చిన్న విరాళమైన ఈ నిధి స్వీకరించనుంది. 

16:54 March 28

  • West Bengal: Villagers of Vangidi village in Balarampur area of Purulia, who have recently returned from Chennai, have quarantined themselves for 14 days on a tree since they do not have a separate room in their houses for isolation. #COVID19 pic.twitter.com/oHUq0j8RZ8

చెట్లపైనే నివాసం...

బంగాల్​ బలరామ్​పుర్​ ప్రాంతం వంగిడి గ్రామంలో కొంతమంది చెట్లపై నిర్బంధ కేంద్రాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇటీవల చెన్నై నుంచి వచ్చిన వీరు తమ ఇళ్లలో ప్రత్యేక గదులు లేక ఇలా చెట్లపై ఉంటున్నారు. అయితే సాధారణంగా ఈ చెట్లపై ఏర్పాటు చేసిన నివాసాల నుంచి ఏనుగుల రాకను గమనించేవారు గ్రామస్థులు.

16:31 March 28

24 గంటల్లో...

స్పెయిన్​లో కరోనా మహమ్మారికి 24 గంటల్లో 832 మంది బలయ్యారు. దేశంలో మొత్తం మృతుల సంఖ్య 5,690కి చేరింది.

16:17 March 28

గుజరాత్​లో నలుగురు మృతి...

గుజరాత్​ అహ్మదాబాద్​లో 46 ఏళ్ల కరోనా బాధితురాలు మృతి చెందింది. మార్చి 26న ఆమె ఆసుపత్రిలో చేరింది. కరోనా సోకే నాటికే ఆమెకు హైపర్​టెన్షన్​, డయాబెటిస్​ ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.​

16:11 March 28

కేంద్ర ఆరోగ్యశాఖ మీడియా సమావేశం...

  • కరోనా కట్టడికి రాష్ట్రాలతో సమన్వయం చేస్తూ పనిచేస్తున్నాం: కేంద్ర ఆరోగ్యశాఖ
  • లాక్‌డౌన్‌, వైద్యపరమైన అంశాలపై సీఎస్‌లతో మాట్లాడుతున్నాం: కేంద్ర ఆరోగ్యశాఖ
  • లాక్‌డౌన్‌, సామాజిక దూరం సరిగా అమలు చేయాలని సూచిస్తున్నాం: కేంద్ర ఆరోగ్యశాఖ
  • వైద్యపరంగా అవసరమైన సౌకర్యాల కల్పనకు చర్యలు: కేంద్ర ఆరోగ్యశాఖ
  • రాష్ట్రాల్లో ప్రత్యేక నోడల్‌ అధికారులను నియమించాం: కేంద్ర ఆరోగ్యశాఖ
  • వలస వెళ్లే వారి విషయంలో అవసరమైన చర్యలకు ఆదేశించాం: కేంద్ర ఆరోగ్యశాఖ
  • ప్రజలకు నిత్యావసరాలు అందుబాటులో ఉండేలా చర్యలు: కేంద్ర ఆరోగ్యశాఖ
  • లాక్‌డౌన్‌ను ఎవరూ ఉల్లంఘించకుండా చర్యలు చేపడుతున్నాం: కేంద్ర ఆరోగ్యశాఖ
  • రోగులకు 3 నెలలకు సరిపడా మందులు ఇవ్వడానికి చర్యలు: కేంద్ర ఆరోగ్యశాఖ
  • నిత్యావసరాల సరఫరాకు అనుమతించాలని రాష్ట్రాలకు సూచించాం: కేంద్ర ఆరోగ్యశాఖ
  • రాష్ట్రాల మధ్య సరకు రవాణాలో ఇబ్బందులు లేకుండా చర్యలు: కేంద్ర ఆరోగ్యశాఖ

15:58 March 28

పోలీసుల కాల్పులు...

అసోం బంగాయిగావ్​ జిల్లాలోని ఓ మార్కెట్​లో లాక్​డౌన్​పై భద్రతా దళాలకు, ఓ అల్లరిమూకకు మధ్య వాగ్వాదం జరిగింది. భద్రతా దళాలపై వారు దాడి చేయడం వల్ల పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. అయితే ఈ కాల్పుల్లో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు.

15:22 March 28

మరో 139 మంది...

ఇరాన్​లో కరోనా ధాటికి ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. తాజాగా మరో 139 మంది వైరస్​ ధాటికి ప్రాణాలు విడిచారు. మొత్తం మృతుల సంఖ్య 2,517కు చేరింది.

15:12 March 28

కర్ణాటకలో 74 కేసులు...

కర్ణాటకలో మరో 10 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 74కు చేరింది.

15:05 March 28

కశ్మీర్​లో 27 కేసులు...

కశ్మీర్​లో మరో 7 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 27కు చేరింది.

14:54 March 28

జస్టిస్​ రమణ విరాళం...

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయ నిధికి, ప్రధానమంత్రి సహాయ నిధికి ఒక్కొక్క దానికి లక్ష రూపాయల విరాళం అందిస్తున్నట్లు ప్రకటించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ.

కరోనాను ఎదుర్కోవడానికి సహకారం అందిస్తున్నట్లు తెలిపిన జస్టిస్ రమణ

14:47 March 28

పలు ఆదేశాలు...

  • వలస కూలీలను ఆదుకునేందుకు సూచనలు చేస్తూ హోం శాఖ ఆదేశాలు.
  • అన్ని రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాసిన హోం శాఖ సంయుక్త కార్యదర్శి సంజీవ్ కుమార్.
  • కొవిడ్ 19 ప్రభావం నేపథ్యంలో వలస కూలీలకు వసతి కల్పించి,  ఆహారం అందించి, బట్టలు అందించాలని, అవసరమైన వైద్య సదుపాయాలు కూడా కల్పించాలని ఆదేశాలు జారీ చేసిన హోం శాఖ.
  • రాష్ట్ర విపత్తు నిధులను వినియోగించుకునే విషయంలో గతంలో జారీ చేసిన మార్గదర్శకాలకు అదనంగా ఈ సూచనలు కూడా అమలులోకి తీసుకోవాలని పేర్కొన్న హోం శాఖ.
  • రాష్ట్ర విపత్తు నిధి నుంచి నిధులు వాడుకునేందుకు అవకాశం కలిపించిన కేంద్రం

14:19 March 28

  • Tamil Nadu: Police in Chennai has been creating awareness among the people about the importance of them staying at home amid #CoronavirusLockdown by making a police personnel wear a helmet designed to look like Coronavirus. The helmet has been designed by a local artist Gowtham. pic.twitter.com/LlxrUYfihX

వినూత్న ప్రచారం...

కరోనాపై అవగాహన కోసం తమిళనాడులోని చెన్నై పోలీసులు వినూత్న ప్రచారం చేశారు. కరోనా వ్యాప్తి వేళ ప్రజలు ఇళ్లకే పరిమితమవ్వాలని తెలియజేసేలా కరోనా రూపంలో ఉన్న హెల్మెట్​ ధరించారు. స్థానిక కళాకారుడు గౌతమ్​ ఈ హెల్మెట్​ను రూపొందించాడు.

13:43 March 28

కరోనా పరీక్షలు ఎవరు చేయించుకోవాలి? 

కరోనాపై ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. దగ్గినా, తుమ్మినా భయపడే పరిస్థితి నెలకొంది. సాధారణ జలుబు చేసినా.. కరోనా వైరస్‌ సోకిందేమోనన్న భయం జనాన్ని వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో కరోనా పరీక్షలు ఎవరు చేయించుకోవాలో స్పష్టం చేస్తూ కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ సమాచార పత్రాన్ని విడుదల చేసింది.

13:42 March 28

ప్రధానికి కేరళ సీఎం లేఖ 

కరోనా ప్రభావం నేపథ్యంలో కేరళ సీఎం పినరయి విజయన్‌ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. లాక్‌డౌన్‌తో సరిహద్దు రోడ్డును కర్ణాటక మూసివేసిందని ఫిర్యాదు చేశారు. దీంతో తమ రాష్ట్రానికి వచ్చే నిత్యావసరాలు నిలిచిపోయాయన్నారు. నిత్యావసరాల రవాణా సాఫీగా జరిగేలా చూడాలని ప్రధానిని కోరారు. 

12:29 March 28

మోదీ వీడియో కాన్ఫెరెన్స్​... 

ఆయుష్​ నిపుణులతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫెరెన్స్​ నిర్వహిస్తున్నారు. కరోనా వైరస్​ నియంత్రణపై చర్చిస్తున్నారు.

12:16 March 28

దేశంలో మరో వ్యక్తి...

కేరళలో తొలి కరోనా వైరస్​ మరణం సంభవించింది. రాష్ట్రంలోని కొచ్చిలోని ఆసుపత్రిలో ఓ వ్యక్తి వైరస్​తో మృతి చెందారు. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది.

11:34 March 28

రైళ్లలో ఐసోలేషన్​ కోచ్​లు...

కరోనా వైరస్​పై పోరాడేందుకు రైల్వేశాఖ రైళ్లలో ఐసోలేషన్​ కోచ్​లను సిద్ధం చేసింది. రోగి బెర్త్​ ముందు ఉండే 3 బెర్త్​లను ఖాళీ చేశారు అధికారులు. శౌచాలయాలను ఐసోలేషన్​ కేంద్రాలకు అనుగుణంగా శుభ్రం చేయించారు.

11:11 March 28

సుప్రీంలో పిటిషన్​...

  • దేశవ్యాప్తంగా వలస కూలీలకు రవాణా సౌకర్యం కల్పించాలని పిటిషన్ దాఖలు చేసిన సుప్రీంకోర్టు న్యాయవాది అలోక్ శ్రీవాస్తవ
  • వేల మంది వలస కూలీలు ఇళ్లకు వెళ్లేందుకు కాలినడకన వందల కిలోమీటర్లు నడుస్తున్నారని పేర్కొన్న న్యాయవాది అలోక్ శ్రీవాస్తవ
  • వారు ఇళ్లకు చేరేందుకు రవాణా, కనీస సౌకర్యాలు కల్పించాలని కోరిన పిటిషనర్

10:49 March 28

మరో 6 కేసులు...

గుజరాత్​లో మరో ఆరు కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 53కు చేరింది.

10:37 March 28

పెద్ద ఎత్తున జనం...

కరోనా నియంత్రణలో భాగంగా కేంద్రం లాక్​డౌన్​ విధించిన వేళ దిల్లీ-ఉత్తర్​ప్రదేశ్​ సరిహద్దు వద్ద పెద్దఎత్తున ప్రజలు గుమిగూడారు. సొంతూళ్లకు వారిని చేర్చేందుకు యూపీ ప్రభుత్వం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది.

10:12 March 28

విద్యుత్​ బిల్లులు కట్టక్కర్లేదా?

  • కరోనా వైరస్ ముప్పు కారణంగా లాక్ డౌన్ ప్రకటనతో సాధారణ ప్రజలకు సహాయ ప్యాకేజీని ప్రకటించే యోచనలో విద్యుత్ మంత్రిత్వ శాఖ
  • వచ్చే మూడు నెలలు విద్యుత్ బిల్లు చెల్లించడంలో ఆలస్యం అయినా.. జరిమానా మినహాయించనున్నట్లు తెలిపిన అధికార వర్గాలు.
  • అన్ని రాష్ట్రాల రెగ్యులేటరీలకు కేంద్ర విద్యుత్ రెగ్యులేటరీ సంస్థ ఈరోజు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు వెల్లడించిన వర్గాలు.
  • గత రెండు రోజులుగా విద్యుత్ శాఖ అధికారులతో కేంద్ర ఇంధన శాఖ మంత్రి ఆర్ కే సింగ్ సంప్రదింపులు జరిపినట్లు వెల్లడించిన అధికారులు.

09:50 March 28

virus
దేశంలో 873కు చేరిన వైరస్​ కేసులు

873...

భారత్​లో కరోనా పాజిటివ్​ కేసులు 873కు చేరుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. విదేశీయులు, 79 మంది డిశ్చార్జ్​ అయిన వ్యక్తులు, 19 మంది మృతులతో కలిపి ఈ గణాంకాలను వెల్లడించింది.

09:09 March 28

మధ్యప్రదేశ్​ జర్నలిస్టుపై కేసు

మధ్యప్రదేశ్​లో కరోనా వైరస్​ సోకిన పాత్రికేయుడిపై ఆ రాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు. లండన్​ నుంచి తిరిగి వచ్చిన కుమార్తెకు కరోనా సోకిందని తెలిసినా ఆ జర్నలిస్టు కాంగ్రెస్​ సీనియర్ నేత కమల్​నాథ్​ నిర్వహించిన పత్రికా సమావేశానికి హాజరైనందుకు ఈమేరకు చర్యలు తీసుకున్నారు. 

09:02 March 28

కరోనా పంజా: పెరుగుతున్న కేసులు- మహారాష్ట్రలో కొత్తగా 6

దేశంలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. మహారాష్ట్రలో మరో ఆరుగురికి వైరస్​ సోకింది. ముంబయిలో ఐదుగురు, నాగ్​పుర్​లో ఒకరికి కరోనా పాజిటివ్​గా తేలినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 159కి చేరిందని చెప్పారు.

కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం... దేశవ్యాప్తంగా కరోనా కారణంగా ఇప్పటివరకు 19 మంది మృతిచెందారు. 749 మంది వైరస్​ బారినపడి ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. 66 మంది పూర్తిగా కోలుకున్నారు.

Last Updated : Mar 28, 2020, 11:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.