దేశంలో కరోనా సంక్రమణ వేగం తగ్గుముఖం పడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. కేసుల వృద్ధిరేటు రెండు రోజులుగా 5 శాతంలోపే ఉంది. మరోవైపు వరుసగా ఆరో రోజు దేశంలో 6 వేలకుపైగా కేసులు వెలుగుచూశాయి. తాజాగా 24 గంటల్లో 6,387 మంది వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యారు. కొత్తగా 3,935 మంది కోలుకోగా, 170 మంది మృత్యువాతపడ్డారు.
తాజా మరణాల్లో 80% మహారాష్ట్ర, గుజరాత్, దిల్లీల్లోనే చోటుచేసుకున్నాయి. ఒక్క మహారాష్ట్రలోనే 97 మంది మృత్యువాతపడటం అక్కడి విషమ పరిస్థితులకు అద్దం పడుతోంది. ఉత్తరాదిలో బుధవారం ఒక్క ఉత్తర్‌ప్రదేశ్ మినహా అన్ని రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదయ్యాయి.
జూన్ 17 నాటికి ఐదు లక్షల క్రియాశీల కేసులు!
వచ్చే నెల 17 నాటికి దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 5,02,470కి పెరుగుతుందని దిల్లీ ఐఐటీ పరిశోధక బృందం తాజాగా అంచనా వేసింది. అదే రోజు నాటికి వాటి సంఖ్య తెలంగాణలో 2,451కి, ఆంధ్రప్రదేశ్‌లో 703కు చేరుతుందని పేర్కొంది. దేశంలో సగటున ఒక్కో కరోనా బాధితుడు కనిష్ఠంగా 0.03 మంది నుంచి గరిష్ఠంగా ఐదుగురికి వైరస్‌ను సంక్రమింపజేసే అవకాశం ఉన్నట్లు బృందం అంచనా వేసింది. వచ్చే నెల 17 నాటికి సంబంధించి మరిన్ని అంచనాలు..
- కేసులు అసోంలో 86 వేలకు, ఛత్తీస్‌గఢ్‌లో లక్షకు చేరుతాయి.
- మహారాష్ట్రలో క్రియాశీల కేసులు 1.09 లక్షలకు పెరుగుతాయి.
- కేరళ, ఛత్తీస్‌గఢ్, అసోం, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ రెడ్‌జోన్‌లో ఉంటాయి.
- బిహార్, జమ్మూ-కశ్మీర్, కర్ణాటక, ఝార్ఖండ్ ఆరెంజ్ జోన్‌లో ఉంటాయి.
పది రాష్ట్రాల్లోనే 87% కేసులు
దేశమంతటా కరోనా ఉద్ధృతి ఒకేలా కాకుండా భిన్నంగా ఉంది. ఇప్పటివరకు 35 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు మహమ్మారి విస్తరించింది. మొత్తం కేసుల్లో 87% పైగా కేవలం 10 రాష్ట్రాల్లోనే ఉన్నాయి. వీటిలో ప్రతి రాష్ట్రంలోనూ 2,500 కంటే ఎక్కువ కేసులున్నాయి. మరో 12 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో 9%పైగా, మిగిలిన పదమూడింటిలో 0.47% కేసులు వెలుగుచూశాయి. 2.64% మంది బాధితులను పలు రాష్ట్రాలు వెనక్కి పంపడంతో.. వారిని ప్రస్తుతానికి ఏ రాష్ట్రాల జాబితాలోనూ చేర్చలేదు.
కరోనా ప్రభావం ఇలా..
2,500 కంటే ఎక్కువ కేసులున్న రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలను ‘ఎ’ కేటగిరీగా, 250-2,500 మధ్య కేసులున్నవాటిని ‘బి’ కేటగిరీగా,
250 కేసుల కంటే తక్కువున్నవాటిని ‘సి’గా వర్గీకరించి చూస్తే..