ETV Bharat / bharat

మహారాష్ట్రలో ఒక్కరోజే 597 కరోనా కేసులు-మొత్తం 9915 - భారతదేశంలో కొవిడ్​ వైరస్​

corona-india-toll
దేశంలో 24 గంటల్లోనే 73 మంది మృతి
author img

By

Published : Apr 29, 2020, 8:39 AM IST

Updated : Apr 29, 2020, 9:06 PM IST

21:01 April 29

'మహా'లో ఆగని కరోనా విలయం

మహారాష్ట్రలో ఇవాళ ఒక్కరోజే 597 కరోనా కేసులు, 32 మరణాలు నమోదయ్యాయి. వీటితో కలిపి ఆ రాష్ట్రంలో మొత్తం కొవిడ్​-19 కేసుల సంఖ్య 9915కు చేరింది. మృతులు 432కు పెరిగారు.

20:54 April 29

గుజరాత్​లో 24 గంటల్లో 308 కేసులు

గుజరాత్​లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 308 మందికి కరోనా పాజిటివ్​గా తేలింది. వీరితో కలిపి ఆ రాష్ట్రంలో కొవిడ్​-19 మొత్తం కేసుల సంఖ్య 4082కు చేరింది. అక్కడ ఇప్పటివరకు 527 మంది వైరస్​ బారినపడి కోలుకోగా.. 197 మంది మృతి చెందారు.

19:12 April 29

తమిళనాడులో ఇవాళ మరో 104 కరోనా పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి.

18:49 April 29

  • లాక్‌డౌన్‌తో రాజస్థాన్‌లోని మౌంట్‌ అబూలో చిక్కుకున్న భక్తులు
  • మార్చి 12న ప్రజాపిత బ్రహ్మకుమారీస్‌ ఆధ్యాత్మిక కేంద్రానికి వెళ్లిన భక్తులు
  • మార్చి 22న రావాల్సి ఉన్నా లాక్‌డౌన్‌తో అక్కడే చిక్కుకున్న భక్తులు
  • రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి స్వస్థలాలు చేరేలా చూడాలని విజ్ఞప్తి
  • స్వస్థలాలకు వచ్చాక ఆరోగ్య పరీక్షలు, క్వారంటైన్‌కు సిద్ధంగా ఉన్నామని వెల్లడి
  • మహారాష్ట్ర, రాజస్థాన్‌ భక్తులను స్వస్థలాలకు తీసుకెళ్లిన ఆయా రాష్ట్రాలు

18:28 April 29

వలస కూలీలపై కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలు

వలస కూలీలు, కార్మికులను స్వస్థలాలకు చేర్చడంపై కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. విద్యార్థులు, పర్యాటకులు, యాత్రికుల తరలింపుపై అన్ని రాష్ట్రాలు నోడల్ అధికారులను నియమించుకోవాలని సూచించింది. తరలింపుపై రెండు రాష్ట్రాలూ పరస్పరం అంగీకారానికి వచ్చిన తర్వాత అందరికీ వైద్య పరీక్షలు చేసి అనుమతించాలని వెల్లడించింది. వీటితో పాటు

  • బస్సుల్లో తరలించేటప్పుడు భౌతికదూరం పాటించాలని సూచన
  • బస్సులను శానిటైజ్‌ చేసి నిబంధనలు పాటించాలని హోంశాఖ సూచన
  • స్వస్థలాలకు చేరుకున్నాక హోం క్వారంటైన్‌లో ఉండేలా చూడాలన్న హోంశాఖ
  • ఇళ్లకు చేరుకున్నాక కూడా తరచుగా ఆరోగ్య పరీక్షలు జరపాలని సూచన
  • ఆరోగ్యసేతు యాప్ డౌన్‌లోడ్ చేసుకునేలా వారికి అవగాహన కల్పించాలని సూచన

17:46 April 29

దేశవ్యాప్తంగా మొత్తం కరోనా కేసులు 31,787కు చేరాయి. మరణాలు 1008కి పెరిగాయి. ఇప్పటివరకు 7797 మంది కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 

17:12 April 29

పరిస్థితులు కుదుటపడ్డాకే పార్లమెంట్​ సమావేశాలు: వెంకయ్య

రాజ్యసభ సభ్యులతో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సమావేశమయ్యారు. కరోనా పరిస్థితులు కుదుటపడ్డాకే తర్వాతి పార్లమెంట్​ సమావేశాలు ఉంటాయని ఎంపీలకు వెంకయ్య చెప్పారు.    

15:33 April 29

కరోనా వ్యాప్తి దృష్ట్యా పంజాబ్​లో కర్ఫ్యూను మరో రెండు వారాలు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు ముఖ్యమంత్రి అమరీందర్​ సింగ్​. అయితే రోజూ ఉదయం 7 నుంచి 11 గంటల వరకు లాక్​డౌన్​ అమల్లో ఉండదని, అవసరాలకు అనుగుణంగా ఆ సమయంలోనే ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావచ్చని స్పష్టం చేశారు. 

దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న లాక్​డౌన్​ మే 3న ముగియనుంది.  

13:29 April 29

'ఆరోగ్య సేతు'ను తప్పక డౌన్​లోడ్​ చేసుకోవాలి​: కేంద్రం

కేంద్ర ప్రభుత్వ అధికారులు, సిబ్బంది వెంటనే తమ మొబైల్ ఫోన్లలో 'ఆరోగ్య సేతు' యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని కేంద్రం సూచించింది. కార్యాలయానికి వచ్చేటప్పుడు ఆరోగ్య సేతు యాప్​లోకి వెళ్లి  ఆరోగ్య పరిస్థితిని సమీక్షించుకోవాలని తెలిపింది. అందులో ఇచ్చే రిపోర్టు ఆధారంగా కార్యాలయానికి రావాలని చెప్పింది. ఏమైనా తేడా ఉంటే ఐసోలేషన్​లో ఉండాలని పేర్కొంది.   

12:39 April 29

పంజాబ్​లో మరో 16మందికి కరోనా  

పంజాబ్​లో మరో 16మందికి కరోనా సోకినట్లు ఆ రాష్ట్ర ఆర్యోగ్య శాఖ తెలిపింది. అందులో 12మంది యాత్రికులు ఉన్నట్లు పేర్కొంది.

12:35 April 29

కర్ణాటకలో 9కొత్త కేసులు

కర్ణాటకలో కొత్తగా తొమ్మిది మందికి కరోనా సోకింది. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 532కు చేరింది. అందులో 20 మంది చనిపోగా.. 215 మంది డిశ్చార్జ్​ అయ్యారు. 

11:11 April 29

భారతీయులను తరలించేందుకు నౌకలు సిద్ధం

కరోనా వ్యాప్తి నేపథ్యంలో గల్ఫ్ దేశాల నుంచి భారతీయులను తరలించేందుకు నావికాదళం సిద్ధమవుతోంది. ఇందుకోసం మూడు నౌకలను సిద్ధం చేస్తోంది. కేంద్రం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే తరలి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాయి. 

10:23 April 29

మహారాష్ట్రలో కరోనా@ 9,318 కేసులు, 400 మరణాలు

మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకు కేసులు పెరిగిపోతున్నాయి. ఒక్కరోజే 729 కేసులు, 31 మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 9,318కు చేరుకోగా.. 400 మంది మరణించారు.

08:36 April 29

దేశంలో 24 గంటల్లోనే 73 మంది మృతి

దేశంలో కరోనా విజృంభణ మరింత తీవ్రమైంది. గడిచిన 24 గంటల్లో 73 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 1897 మంది వైరస్ బారిన పడ్డారు. కేంద్ర ఆరోగ్య శాఖ ఈమేరకు వెల్లడించింది.

  • మొత్తం కేసులు: 31332
  • యాక్టివ్ కేసులు: 22629
  • మరణాలు: 1007
  • కోలుకున్నవారు: 7695
  • వలస వెళ్లిన వారు: 1

Last Updated : Apr 29, 2020, 9:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.