దేశంలో కరోనా కేసుల సంఖ్య స్థిరంగా పెరుగుతూనే ఉంది. తమిళనాడులో కొత్తగా 5,088 మందికి కరోనా సోకింది. మొత్తం కేసుల సంఖ్య 6,40,943కు ఎగబాకింది. మహమ్మారి ధాటికి కొత్తగా 68 మంది బలవ్వగా.. మృతుల సంఖ్య 10,052కు చేరింది. ఫలితంగా దేశంలో మహారాష్ట్ర తర్వాత అత్యధిక మరణాలు నమోదైన రాష్ట్రాలలో రెండోస్థానంలో నిలిచింది.
- మహారాష్ట్రలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. కొత్తగా 13,395 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. బాధితుల సంఖ్య 14,93,884కు పెరిగింది. వైరస్ సోకిన వారిలో మరో 358 మంది చనిపోయారు. దీంతో మొత్తం ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 39,430కు చేరింది.
- కేరళలో మరో 5,445 మంది కొవిడ్ బారినపడ్డారు. ఫలితంగా బాధితుల సంఖ్య 2లక్షల 60వేలకు సమీపించింది. ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు 900మందికిపైగా కరోనాతో మరణించారు.
- ఉత్తర్‌ప్రదేశ్‌లో ఒక్కరోజే 3,376 మందికి కరోనా సోకింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,27,459కి పెరిగింది. వైరస్ కారణంగా మరో 45 మంది చనిపోగా.. మృతుల సంఖ్య 6,245కు చేరింది.
- దిల్లీలో కొత్తగా 2,726 కరోనా కేసులు బయటపడ్డాయి. బాధితుల సంఖ్య మూడు లక్షలు దాటింది. కొవిడ్ కారణంగా మరో 37 మంది మరణించగా.. చనిపోయిన వారి సంఖ్య 5,616కు పెరిగింది.
- రాజస్థాన్‌లో మరో 2,138 కరోనా కేసులు వెలుగుచూశాయి. బాధితుల సంఖ్య 1,52,605కు పెరిగింది. ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు 1,605 మంది కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చదవండి: టీకా పంపిణీపై స్విగ్గీ, జొమాటోతో కేంద్రం చర్చలు!